90 ఎంఎల్ ఫస్ట్ లుక్: మందు బాటిళ్ల పై హీరో

హీరో కార్తికేయ ‘ఆర్ఎక్స్ 100’ సినిమా తో సూపర్ హిట్ ని అందుకున్నాడు. మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ…. తన రెండవ సినిమా ‘హిప్పీ’ తో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాడు. దిగంగనా సూర్య వంశీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత తన ఆశలన్నీ తన తదుపరి సినిమా పైనే పెట్టుకున్నాడు కార్తికేయ. ఈసారి ఒక కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు కార్తికేయ.

ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ’90 ఎమ్ ఎల్’ అనే ఆసక్తికరమైన టైటిల్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. టైటిల్ లాగానే సినిమా కూడా మరింత ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర బృందం అంటోంది. ఈ పోస్టర్ లో కార్తికేయ మందు బాటిళ్ల మధ్యలో పడుకొని పోజ్ ఇవ్వడం విశేషం.

మరి కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారట.