సై రా టీజర్…. మహేష్ ఇలా స్పందించాడు

మహేష్ బాబు సైరా టీజర్ పై స్పందించాడు. టీజర్ మైండ్ బ్లోయింగ్ గా ఉందంటూ సైరా యూనిట్ కి కితాబిచ్చాడు. తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగిన సినీ మహోత్సవం కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశాడు మహేష్ బాబు.

ఈ సినీ మహోత్సవం కార్యక్రమంలో చిరంజీవి, మహేష్ బాబు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇద్దరూ చాలాసేపు ముచ్చటించుకున్నారు. అంతే కాకుండా, ఈవెంట్ లో మహేష్ బాబు… చిరంజీవి హీరోగా రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సై రా నరసింహా రెడ్డి టీజర్ బాగుందంటూ ఇలా స్పందించాడు మహేష్ బాబు.

“ఈ ఫంక్షన్ లో చిరంజీవి గారిని కలవడం కొత్త ఎనర్జిని ఇచ్చింది. ఆయన నటించిన సినిమా సై రా నరసింహా రెడ్డి కి సంబంధించిన టీజర్ ని చూశాను. టీజర్ మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది. మీకు, సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ సర్” అంటూ కామెంట్స్ చేశాడు మహేష్.

ఆ తరువాత తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ యూనియన్‌ నిర్వహించిన ఈ సినీ మహోత్సవం కార్యక్రమం గురించి మాట్లాడాడు మహేష్. “మేనేజర్స్ చేస్తున్న ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భవిష్యత్తులో వారు మరిన్ని సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ చెయ్యాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఇక చిరంజీవి, మహేష్ బాబు కలిసి ఉన్న ఫొటోలను…. అటు మెగా ఫ్యాన్స్, ఇటు ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో భాగా వైరల్ చేసేస్తున్నారు.