Telugu Global
NEWS

అదే నిజమైతే.... టీడీపీ వారిని ప్రొటెక్షన్‌తో తీసుకెళ్తాం....

పల్నాడు ప్రాంతంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించారు హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్. పల్నాడులో శాంతిభద్రతలు క్షీణించాయంటూ టీడీపీ బాధితుల శిబిరం ఏర్పాటు చేసిన నేపథ్యంలో హోంమంత్రి, డీజీపీ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే చూడలేక చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని హోంమంత్రి మండిపడ్డారు. టీడీపీ ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు పోలీసులు, ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులను పంపుతున్నామని ఆమె ప్రకటించారు. అక్కడికి వెళ్లి వారి సమస్య […]

అదే నిజమైతే.... టీడీపీ వారిని ప్రొటెక్షన్‌తో తీసుకెళ్తాం....
X

పల్నాడు ప్రాంతంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించారు హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్. పల్నాడులో శాంతిభద్రతలు క్షీణించాయంటూ టీడీపీ బాధితుల శిబిరం ఏర్పాటు చేసిన నేపథ్యంలో హోంమంత్రి, డీజీపీ మీడియా సమావేశం నిర్వహించారు.

రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే చూడలేక చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని హోంమంత్రి మండిపడ్డారు. టీడీపీ ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు పోలీసులు, ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులను పంపుతున్నామని ఆమె ప్రకటించారు.

అక్కడికి వెళ్లి వారి సమస్య ఏంటో తెలుసుకోవడంతో పాటు… వారిని పోలీసు భద్రత మధ్య వారి గ్రామాలకు తీసుకెళ్తామని చెప్పారు. వారికి నిజంగానే ఇబ్బంది ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెడుతామన్నారు. పిచ్చికుక్కపై రాయి వేసినా సరే వైసీపీ వాళ్లు అంటూ గత ఐదేళ్లలో పల్నాడులో కేసులు పెట్టించిన ఘనత టీడీపీ నేతలదేనన్నారు ఆమె.

ప్రభుత్వం మారిన వెంటనే ప్రతీకార చర్యలాంటి సంఘటనలు జరగకూడదనే పోలీసు ఉన్నతాధికారులు గ్రామాల్లోకి వెళ్లి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారన్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన శిబిరాల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు హోంమంత్రి నవ్వు ఆపుకోలేకపోయారు.

ఈనెల 11న పల్నాడు ప్రాంతంలో ర్యాలీ చేస్తామన్న ప్రకటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. పల్నాడు ప్రాంతంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య లేదని… అనవసరంగా అక్కడికి ఇతర నేతలు వెళ్లి మంచి వాతావరణాన్ని చెడగొట్టడం, శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగేలా ఊరేగింపులు చేయడం సరికాదన్నారు. అలాంటి ప్రయత్నాలకు తాము అనుమతి ఇవ్వబోమన్నారు.

First Published:  9 Sep 2019 6:44 AM GMT
Next Story