ఎన్టీఆర్ సినిమాను… మహేష్ చేస్తున్నాడు !

మహర్షి సినిమాతో తన కెరీర్ లోనే భారీ విజయం అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత వెంటనే… అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలనే ధీమాతో ఉన్న మహేష్… తన నెక్స్ట్ సినిమా పనులని కూడా అప్పుడే మొదలు పెట్టాడు.

అయితే మహేష్ కి ఇప్పుడు కె.జి.యఫ్  దర్శకుడు ప్రశాంత్ నీల్ తగిలాడు. ప్రశాంత్ నీల్ తో ఎలాగైనా సినిమా చేయాలని భావిస్తున్నాడట మహేష్. నిన్న హైద్రాబాద్ వచ్చిన ప్రశాంత్…. మహేష్ కి కథ చెప్పాడట.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాని మహేష్ చేస్తున్నాడట. నిజానికి ప్రశాంత్ నీల్…. ఎన్టీఆర్, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలి…. కానీ అనుకోకుండా ఇప్పుడు దర్శకుడు వచ్చి మహేష్ కాంపౌండ్ లో కి వచ్చి పడ్డాడు.

ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే అంశం పైన క్లారిటీ లేదు… కాకపోతే మహేష్ మాత్రం ప్రశాంత్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడనే మాటలు వినిపిస్తున్నాయి.