Telugu Global
Cinema & Entertainment

400 కోట్ల క్లబ్ లో చేరిన సాహో

ఓవరాల్ వసూళ్లలో సాహో సినిమా మరో మైలురాయి అందుకుంది. నిన్నటితో 10 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే వసూళ్ల పరంగా చూసుకుంటే.. ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలే ఛాన్స్ ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాకు వసూళ్లు తగ్గిపోయాయి. రంగస్థలం, భరత్ అనే నేను సినిమాల లైఫ్ టైమ్ వసూళ్లను ఇది అధిగమించడం కష్టం అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో […]

400 కోట్ల క్లబ్ లో చేరిన సాహో
X

ఓవరాల్ వసూళ్లలో సాహో సినిమా మరో మైలురాయి అందుకుంది. నిన్నటితో 10 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే వసూళ్ల పరంగా చూసుకుంటే.. ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలే ఛాన్స్ ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాకు వసూళ్లు తగ్గిపోయాయి. రంగస్థలం, భరత్ అనే నేను సినిమాల లైఫ్ టైమ్ వసూళ్లను ఇది అధిగమించడం కష్టం అంటున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో సాహో పరిస్థితి మరీ దీనంగా తయారైంది. సినిమాను 125 కోట్ల రూపాయలకు అమ్మితే, నిన్నటి వసూళ్లతో కలుపుకొని కేవలం 77 కోట్ల 60 లక్షల రూపాయల నెట్ మాత్రమే వచ్చింది.

సో… ఏపీ, నైజాంలో ఇది బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యమని తేలిపోయింది. అటు హిందీలో మాత్రం సాహో సినిమా హిట్ అనిపించుకుంది. ఇప్పటికే వంద కోట్ల మార్క్ అందుకున్న ఈ సినిమా, ఇప్పటికీ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 10 రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 27.36 కోట్లు
సీడెడ్ – రూ. 11.05 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 8.58 కోట్లు
ఈస్ట్ – రూ. 7.14 కోట్లు
వెస్ట్ – రూ. 5.40 కోట్లు
గుంటూరు – రూ. 7.75 కోట్లు
నెల్లూరు – రూ. 4.13 కోట్లు
కృష్ణా – రూ. 4.93 కోట్లు

First Published:  9 Sep 2019 5:10 AM GMT
Next Story