ఆతరువాతే సుధీర్ వర్మతో..!

ఈ మధ్యనే శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రణరంగం’ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమాలో ముందు రవితేజ హీరోగా నటించాల్సి ఉందట. కానీ శర్వా కి కథ నచ్చడంతో సుధీర్ వర్మ…. శర్వానంద్ ని హీరోగా పెట్టి సినిమా తీశాడు.

అయితే తాజాగా ఇప్పుడు సుధీర్ వర్మ… రవితేజతో కలిసి మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నాడు. మరి ఈ సినిమాకి నిర్మాత ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం రవితేజ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.

‘డిస్కో రాజా’ పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కూడా పూర్తయిన తరువాతే సుధీర్ వర్మ తో రవితేజ సినిమా చేయబోతున్నాడని చెబుతున్నారు.

మరి అప్పటి దాకా సుధీర్ వర్మ ఎదురు చూస్తాడా? లేక ఈ గ్యాప్ లో మరో హీరోతో సినిమా తీస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.