Telugu Global
NEWS

బడ్జెట్ టైం: బీజేపీని ఇరుకునపెట్టిన కేసీఆర్

దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. ఆ ప్రభావం తెలంగాణపై కూడా పడిందని కేసీఆర్ వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బడ్జెట్ ను సోమవారం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీజేపీ నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ఆర్థిక మాంద్యం ముంచుకొచ్చిందని.. ఆటోమొబైల్ సహా అన్ని రంగాలు కుదేలయ్యాయని.. ఆ ప్రభావం రాష్ట్రంపై పడిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వాహనాల అమ్మకాలు తగ్గాయని.. ఆటోమొబైల్ రంగం […]

బడ్జెట్ టైం: బీజేపీని ఇరుకునపెట్టిన కేసీఆర్
X

దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. ఆ ప్రభావం తెలంగాణపై కూడా పడిందని కేసీఆర్ వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ బడ్జెట్ ను సోమవారం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీజేపీ నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ఆర్థిక మాంద్యం ముంచుకొచ్చిందని.. ఆటోమొబైల్ సహా అన్ని రంగాలు కుదేలయ్యాయని.. ఆ ప్రభావం రాష్ట్రంపై పడిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

వాహనాల అమ్మకాలు తగ్గాయని.. ఆటోమొబైల్ రంగం పడిపోవడంతో వ్యాట్ తగ్గి తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. లక్షలాది మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయారని ఈ విషమ పరిస్థితికి కేంద్రమే కారణమని కేసీఆర్ కడిగిపారేశారు.

విమానయాన రంగంతో సహా జీఎస్టీ అమలులో లెక్కలు అన్ని చెప్పి కేంద్రం వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు.

దేశంలో స్థూల ఆర్థిక విధానాలు శాసించేది కేంద్రమేనని.. కేంద్రం తీసుకొచ్చిన విధానాన్నే రాష్ట్రాలు అనుసరించాలి తప్పా మరో గత్యంతరం లేదని.. అందుకే ఇప్పుడు తెలంగాణ ఆర్థిక స్థితి దిగజారిందని కేసీఆర్ విమర్శలు చేశారు. తెలంగాణలో తగ్గిన ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నందుకు చింతిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ వృద్ధిరేటు పడిపోవడానికి కేంద్ర ప్రభుత్వ విధానమే కారణమని కేసీఆర్ స్పష్టంచేశారు. పన్నులు తగ్గి, ఆదాయం పడిపోయి కేంద్ర నిధులు లేక రాష్ట్రం ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని కేసీఆర్ కేంద్రంపై అసెంబ్లీ బడ్జెట్ లో విమర్శలు చేయడం సంచలనంగా మారింది.

First Published:  9 Sep 2019 4:33 AM GMT
Next Story