వాల్మీకి ట్రైలర్: గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్

ఈ మధ్యనే ‘ఎఫ్ 2: ఫన్ ఎండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్…. తాజాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే ఒక ఆసక్తికరమైన సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

కోలీవుడ్ నటుడు అథర్వ మురళీ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాకి రీమేక్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టీజర్ మరియు పాటలతోనే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసిన దర్శక నిర్మాతలు చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు.

సినిమాలో తన మాస్ లుక్ తో వరుణ్ తేజ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. గద్దల కొండ గణేష్ గా వరుణ్ తేజ్ లుక్ మరియు ఆహార్యం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ట్రైలర్…. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలినీ రవి లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్యన సెప్టెంబర్ 20 న విడుదలకు సిద్ధమవుతోంది.