కిషోర్ తో కాదట… వినాయక్ లైన్ లోకి వచ్చాడు !

ఈ మధ్యనే రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

నభ నటేష్ మరియు నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అప్పటిదాకా రొమాంటిక్ కామెడీ సినిమాలు చేస్తూ లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్… ఈ సినిమాతో మాస్ పాత్రలో కూడా ప్రేక్షకులను మెప్పించగలనని నిరూపించడం మాత్రమే కాకుండా…. వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ కి మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు.

తాజాగా ఇప్పుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం దాన్ని హోల్డ్ లో పెట్టి ‘ఇస్మార్ట్ శంకర్’ లాగానే మాస్ టచ్ ఉన్న మరొక సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నాడట రామ్.

ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న వి వి వినాయక్ తో ఒక సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వివి వినాయక్…. రామ్ కి ఒక కథ చెప్పాడట. కథలో అన్ని మాస్ ఎలిమెంట్లు పుష్కలంగా ఉండడంతో సినిమాకి వెంటనే ఓకే చెప్పేశాడట రామ్. చూస్తూ ఉంటే ఫ్లాప్ దర్శకులు అందరికీ హీరో రామ్ బెస్ట్ ఆప్షన్ గా మారి పోయినట్టుంది.