బాబు పెళ్లిరోజు… లోకేష్ ట్వీట్ ఫొటో వైరల్

చంద్రబాబు నాయుడు మొన్న జరిగిన ఎన్నికల అనంతరం…. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా సహా వివిధ దేశాలకు వెళ్లి సేదతీరారు. అమెరికాలో చంద్రబాబు భార్యతో నడుస్తున్న ఓ ఫొటోను తాజాగా ఆయన కుమారుడు లోకేష్ ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఈరోజు చంద్రబాబు, భువనేశ్వరీ పెళ్లి రోజు. ఈ మేరకు ట్విట్టర్ లో తన తల్లిదండ్రులు చంద్రబాబు-భువనేశ్వరిల ఫొటోను షేర్ చేసి వారికి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు…. ఎన్టీఆర్ తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించారు. వారిద్దరి పెళ్లి రోజు ఈరోజు. అందుకే చంద్రబాబు ఇటీవల అమెరికా పర్యటనలో సరదాగా గడిపిన ఒక ఫొటోను లోకేష్ సేకరించి ట్వీట్ చేశారు.

ఈ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎందుకంటే సీరియస్ గా ఉండే చంద్రబాబు తన భార్యపై చేయివేసి నవ్వుతూ నడుస్తుండగా.. భువనేవ్వరి నల్ల కళ్లద్దాలు, జీన్స్, టీషర్ట్ ధరించి చాలా పాష్ గా దర్శనమిచ్చారు. ఎప్పుడూ ఇలా కనిపించని చంద్రబాబు ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.