సైరా…. సురేందర్ రెడ్డి కి చరణ్ ఇచ్చే సర్ ప్రైజ్ ఇదేనా !

రామ్ చరణ్ హీరో గా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన సినిమా ధృవ. ఈ సినిమా భారీ విజయమే సాధించింది. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ లోనే… సై రా నరసింహ రెడ్డి సినిమా పనుల్లో మునిగిపోయాడు సురేందర్ రెడ్డి. మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమౌతోంది.

అయితే ఈ సినిమా విడుదల అనంతరం దర్శకుడిని ఒక ఫారిన్ ట్రిప్ కి పంపాలని ఈ సినిమా నిర్మాత చరణ్ భావిస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్ కోసం సురేందర్ రెడ్డి దాదాపు గా రెండున్నర ఏళ్ళు కేటాయించాడు. ప్రతిరోజు సినిమా షూటింగ్ సమయంలో అందరికంటే ముందుడడమే కాకుండా…. యూనిట్ మొత్తాన్ని తనదైన శైలిలో, షూటింగ్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుండి నడిపించినందుకు గాను సురేందర్ రెడ్డికి యూరోపియన్ హాలిడే ప్యాకేజ్ తో చరణ్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.

ఈ ట్రిప్ కు అయ్యే ఖర్చు మొత్తాన్ని చరణ్ బరిస్తాడని…. ఈ ట్రిప్ ని గిఫ్ట్ గా సురేందర్ రెడ్డి కి ఇవ్వనున్నాడని సమాచారం.