Telugu Global
NEWS

వాహనదారులకు భారీ ఫైన్లపై స్పందించిన కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన చట్టం అమలు చేసింది. ఇక నుంచి రోడ్డుపై ఏమాత్రం అజాగ్రత్తగా వెళ్లినా, నిబంధనలు పాటించకపోయినా వాహనదారుల గూబ గుయ్యిమనేలా జరిమానాలు పడిపోతున్నాయి. అయితే వాహనదారులకు శరఘాతంగా మారిన ఈ కొత్త చట్టంపై విమర్శలు ఎక్కువయ్యాయి. రోడ్లు సరిగా లేవని.. గుంతలు పూడ్చరని.. కనీస మౌళిక సదుపాయాలు కూడా కల్పించని ప్రభుత్వంపై కూడా ప్రజలు ఫైన్ వేయాలని చాలా మంది సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే ఇదే విషయంపై […]

వాహనదారులకు భారీ ఫైన్లపై స్పందించిన కేటీఆర్
X

కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన చట్టం అమలు చేసింది. ఇక నుంచి రోడ్డుపై ఏమాత్రం అజాగ్రత్తగా వెళ్లినా, నిబంధనలు పాటించకపోయినా వాహనదారుల గూబ గుయ్యిమనేలా జరిమానాలు పడిపోతున్నాయి.

అయితే వాహనదారులకు శరఘాతంగా మారిన ఈ కొత్త చట్టంపై విమర్శలు ఎక్కువయ్యాయి. రోడ్లు సరిగా లేవని.. గుంతలు పూడ్చరని.. కనీస మౌళిక సదుపాయాలు కూడా కల్పించని ప్రభుత్వంపై కూడా ప్రజలు ఫైన్ వేయాలని చాలా మంది సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

అయితే ఇదే విషయంపై తాజాగా కేటీఆర్ స్పందించారు. వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతున్నాయని.. ఎక్కడో ఒక చోట మార్పు మొదలు కావాలని కేంద్రం తెచ్చిన వాహనచట్టాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పుకొచ్చారు.

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారికి జరిమానాలు విధించడం ఎంత మాత్రం తప్పు కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. రూల్స్ పాటిస్తే ఎవరికీ ఫైన్లు పడవని.. దీనిపై సోషల్ మీడియాలో ప్రభుత్వానికి ఫైన్ వేయాలనడాన్ని తప్పుపట్టారు.

దేశం బాగుపడాలంటే, పౌరుల్లో క్రమశిక్షణ రావాలంటే ఇలా భారీ ఫైన్స్ వేయడంలో తప్పులేదని కేటీఆర్ స్పష్టం చేశారు. దీన్ని తప్పుపట్టిన వారిది కూడా తప్పేనని స్పష్టం చేశారు.

First Published:  10 Sep 2019 3:18 AM GMT
Next Story