ఈరోజు ప్రీ లుక్… రేపు ఫస్ట్ లుక్…

వరుస డిజాస్టర్లతో సతమతమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రాలహరి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అదే జోరుతో తన తదుపరి సినిమా తో బిజీగా ఉన్నాడు.

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ అనే ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సాయి ధరంతేజ్ కెరీర్ లో పెద్ద హిట్ సినిమాలలో ఒకటైన ‘సుప్రీమ్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన రాశి ఖన్నా…. మళ్లీ ఇన్నాళ్లకు సాయి ధరమ్ తేజ్ తో రొమాన్స్ చేయబోతోంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ని ఇవాళ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది చిత్ర బృందం. సినిమా ఫస్ట్ లుక్ ని రేపు రాత్రి 8 కి విడుదల చేయనున్నారట. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక ప్రీ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీవాసు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఈ మెగా హీరో విన్నింగ్ స్ట్రీక్ ను క్రియేట్ చేస్తాడో లేదో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.