సాహో.. ఇక బ్రేక్-ఈవెన్ కష్టమే

నిన్నటితో 11 రోజులు పూర్తిచేసుకుంది సాహో సినిమా. శని, ఆదివారాలు కాస్త ఎక్కువ షేర్లు చూసిన ఈ సినిమా సోమవారం నుంచి మళ్లీ చతికిలపడింది. ఈ వీకెండ్ గ్యాంగ్ లీడర్ లాంటి పెద్ద సినిమా వస్తుండడంతో సాహోకు థియేటర్లలో వసూళ్లు కష్టమనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. మూడో వారంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ సాహో ఇంకా బ్రేక్-ఈవెన్ సాధించలేదు.

సాధారణంగా హిట్ టాక్ వచ్చిన సినిమాకు, భారీ స్థాయిలో విడుదలైన సినిమాకు రెండో వీకెండ్ నాటికి దాదాపు 80శాతం రికవరీ అయిపోతుంది. కానీ సాహో సినిమాకు భారీగా డబ్బులు పెట్టడం, భారీ రేట్లకు అమ్మకాలు సాగించడంతో బ్రేక్-ఈవెన్స్ కష్టమౌతున్నాయి. నైజాంలో ఈ సినిమాకు భారీగా వసూళ్లు వస్తున్నాయి. కాకపోతే బ్రేక్-ఈవెన్ కు ఇదింకా సగం దూరంలోనే ఉంది. ఇంకా 11 కోట్లు కావాలి.

కేవలం నైజాంలోనే కాదు.. దాదాపు ప్రతి ప్రాంతంలో సాహో పరిస్థితి ఇలానే ఉంది. ఏపీ, నైజాంలోని దాదాపు ప్రతి సెంటర్ లో ఈ సినిమాకు నష్టాలు తప్పవు. అటు బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా బ్రేక్-ఈవెన్ అందుకుంది. లాభాల బాట పట్టింది. సాహో సినిమాకు ఈ 11 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 27.93 కోట్లు
సీడెడ్ – రూ. 11.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 9.66 కోట్లు
ఈస్ట్ – రూ. 7 కోట్లు
వెస్ట్ – రూ. 5.51 కోట్లు
గుంటూరు – రూ. 7.80 కోట్లు
నెల్లూరు – రూ. 4.18 కోట్లు
కృష్ణా – రూ. 5 కోట్లు