Telugu Global
NEWS

అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మాజీ మంత్రి సోమిరెడ్డి !

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తప్పుడు పత్రాలు సృష్టించి వేరొకరి భూమిని తన భూమిగా విక్రయించిన కేసులో సోమిరెడ్డి విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. తప్పుడు పత్రాలతో భూమిని విక్రయించిన వ్యవహారంలో తమ ముందు హాజరు అవడంతో పాటు, భూమి మీదే అని చెప్పేందుకు అవసరమైన పత్రాలను తీసుకురావాలని విచారణ ఆధికారి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు సోమిరెడ్డి… సోమవారం విచారణాధికారి అయిన నెల్లూరు రూరల్ సీఐ రామకృష్ణ ముందు […]

అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మాజీ మంత్రి సోమిరెడ్డి !
X

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తప్పుడు పత్రాలు సృష్టించి వేరొకరి భూమిని తన భూమిగా విక్రయించిన కేసులో సోమిరెడ్డి విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. తప్పుడు పత్రాలతో భూమిని విక్రయించిన వ్యవహారంలో తమ ముందు హాజరు అవడంతో పాటు, భూమి మీదే అని చెప్పేందుకు అవసరమైన పత్రాలను తీసుకురావాలని విచారణ ఆధికారి నోటీసులు ఇచ్చారు.

ఈ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు సోమిరెడ్డి… సోమవారం విచారణాధికారి అయిన నెల్లూరు రూరల్ సీఐ రామకృష్ణ ముందు హాజరుకావాల్సి ఉంది. సోమిరెడ్డి విచారణకు వస్తారని ప్రకటించిన టీడీపీ నేతలు… స్టేషన్ వద్దకు పెద్దెత్తున వచ్చారు. కానీ సోమిరెడ్డి మాత్రం విచారణకు రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

సాయంత్రం ఆరు సమయంలో సోమిరెడ్డి తరపున ఇద్దరు లాయర్లు వచ్చి డాక్యుమెంట్లు అందజేసేందుకు ప్రయత్నించారు. అయితే డాక్యుమెంట్లు తీసుకున్నట్టు రసీదు ఇచ్చేందుకు సీఐ నిరాకరించడంతో వాటిని తీసుకుని లాయర్లు వెనుదిరిగారు.

వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో ఏలూరు రంగారెడ్డికి చెందిన భూమిని సోమిరెడ్డి తప్పుడు పత్రాల సాయంతో వేరే వారికి విక్రయించారు. రంగారెడ్డి ఫిర్యాదు మేరకే విచారణ జరుగుతోంది. భూమి తనది అని నిరూపించే పత్రాలు సోమిరెడ్డి వద్ద లేకపోవడంతోనే ఆయన విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు.

సాక్ష్యాలు గట్టిగా ఉండడంతో అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో సోమిరెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.

First Published:  10 Sep 2019 1:00 AM GMT
Next Story