బాబోయ్…. పాక్ క్రికెట్ టూర్

  • హడలిపోతున్న శ్రీలంక స్టార్ క్రికెటర్లు
  • పాక్ పర్యటనకు 10మంది క్రికెటర్ల డుమ్మా

పాక్ గడ్డపై క్రికెట్ మ్యాచ్ లు ఆడటం అంటే శ్రీలంక క్రికెటర్లు భయపడిపోతున్నారు. బతుకు జీవుడా అంటూ పాక్ టూర్ కే డుమ్మా కొట్టాలని నిర్ణయించారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మాజీ కెప్టెన్లు ఏంజెలో మాథ్యూస్, లాసిత్ మలింగతో సహా మొత్తం ఎనిమిదిమంది సీనియర్ క్రికెటర్లు..పాక్ టూర్ కు దూరంగా ఉండాలని నిర్ణయించారు.

ఉగ్రవాదుల అడ్డా పాక్ గడ్డపై భద్రతాకారణాల దృష్ట్యా తాము ఆడటానికి సిద్ధంగా లేమని శ్రీలంక బోర్డుకు తెలిపిన సీనియర్ క్రికెటర్లలో మలింగ, మాథ్యూస్ తోపాటు…. తిసార పెరీరా, నిరోషాన్ డిక్ వెల్లా, కుశాల్ పెరీరా, ధనుంజయ డి సిల్వా, అఖిల ధనంజయ, సురంగ లక్మల్, దినేశ్ చండిమల్ ఉన్నారు.

2009లో లాహోర్ వేదికగా పాక్ తో శ్రీలంకజట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఉగ్రవాదుల కారుబాంబు దాడితో విధ్వంసం సృష్టించారు. శ్రీలంకజట్టు తన పర్యటనను అర్థంతరంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చింది.

ఆ తర్వాత నుంచి పాక్ జట్టు దుబాయ్ వేదికగానే ఇతర దేశాలతో క్రికెట్ సిరీస్ లు ఆడుతూ వస్తోంది. అయితే…పాక్ గడ్డపై క్రికెట్ మ్యాచ్ లు లేకపోడంతో అక్కడి క్రికెట్ బోర్డు భారీగా నష్టపోతూ వస్తోంది.

ధనుష్క గుణతిలకే, కరుణరత్నే లాంటి ఆటగాళ్లు మాత్రం కట్టుదిట్టమైన భద్రతకు హామి ఇస్తే తాము పాక్ పర్యటనకు సిద్ధమని ప్రకటించడం విశేషం.