పెళ్లికి రావాలని మోడీకి లేఖ…. సమాధానం చూసి షాక్

దేశానికి ఆయన ప్రధాని .. మోడీ అంటే అభిమానం.. గౌరవం ఉంటాయి. అలాంటి వ్యక్తి ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే.. కాని ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మోడీపై అభిమానంతో పెళ్లికి రావాలని లేఖ రాశాడు. ఆ…. మోడీ రాడు కదా అని మరిచిపోయాడు.. పెళ్లిపనుల్లో మునిగిపోయాడు. కానీ మోడీనుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి సదురు టీచర్ ఉబ్బితబ్బిబవుతున్నాడు.

తమిళనాడులోని వేలూరుకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రాజశేఖరన్ తన కూతురు వివాహాన్ని సెప్టెంబర్ 11న నిశ్చయించాడు. పెళ్లికి అందరికీ ఆహ్వానాలు పంపుతూ మోడీకి కూడా శుభలేఖ పంపుతూ పెళ్లికి రావాలని లెటర్ రాశాడు. మోడీపై ప్రేమతో ఈ పనిచేశాడు. మోడీ ఎలాగూ రాడు.. స్పందించడని భావించాడు.

అయితే అనూహ్యం చోటుచేసుకుంది. మోడీ నుంచి రాజశేఖరన్ కు సమాధానం వచ్చింది. ప్రధాని తిరిగి లేఖ రాయడం విశేషం. మీ కుమార్తె వివాహానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలని…. నా అదృష్టంగా భావిస్తున్నానని…. మోడీ సమాధానమిచ్చాడు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు అంటూ… సుఖసంతోషాలతో జీవించాలంటూ లేఖలో మోడీ పేర్కొన్నారు.

మోడీ తిరిగి లేఖ రాయడంపై హర్షం వ్యక్తం చేసిన రాజశేఖరన్ కుటుంబం ఆనందంలో మునిగిపోయారు. తమ లేఖకు సమాధానంగా లేఖ పంపిన ప్రధాని లేఖను ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటామని రాజశేఖరన్ ఆనందంగా తెలిపాడు.