తనీష్ కి…. బర్త్ డే గిఫ్ట్ పంపిన చిరంజీవి

మెగా స్టార్ చిరంజీవి చాలా అరుదుగా గిఫ్ట్స్ పంపుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా యువ లైఫ్ మెంబర్ షిప్ ని తనీష్ పుట్టిన రోజు కానుక గా ఇచ్చారు ఆయన. ఈ విషయాన్ని స్వయం గా తనీష్ ప్రకటించాడు. ఎంతో సంతోషం గా కూడా ఉంది అని ఆయన పేర్కొన్నాడు.

“నా పుట్టిన రోజు సర్ ప్రైజ్ అప్పుడే అయిపోలేదు. మెగా స్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి నా పుట్టిన రోజు కానుక వచ్చింది. ఈ గిఫ్ట్ రావడం నాకు చాలా సంతోషం గా ఉంది. నాకు మాటలు రావడం లేదు. అంతే కాకుండా చిరంజీవి గారు నా ఆరోగ్యం కాపాడుకోమని సలహా ఇచ్చారు. నన్ను ఫిట్ గా ఉండటానికి ప్రయత్నం చేయమనడమే కాకుండా… నన్ను సీరియస్ గా తీసుకోవాలని హెచ్చరించారు. ఆయన కూడా నా ప్రోగ్రెస్ ని ట్రాక్ చేస్తాను అని చెప్పారు. భయం మరియు భక్తి తో కూడిన ఆనందంలో ఉన్నాను నేను ఇప్పుడు. చిరంజీవి సర్ కి ధన్యవాదాలు. మీకు చేసిన వాగ్దానం నేను తప్పకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీరు ఎప్పుడూ నన్ను ఇన్స్ పేర్ చేస్తూ ఉంటారు” అని తనీష్ తన పేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నాడు.

And my birthday suprises are not done yet??? This lovely gesture from MEGASTAR CHIRANJEEVI GARU as a gift for my BIRTHDAY MADE MY DAY❤️❤️❤️ ABSOLUTELY ON CLOUD9?? He advised me to take good care of my health and to be fit and sent me this and said i should take it seriously and he will be monitoring me! Bhayam bhakthi tho koodina anandham lo unna… THANKS A TON SIR?? I will make sure I won’t let down my promise to you. You always inspire me and i will keep up my spirit with that inspiration?? SYE RAA #bestbirthdaygift #megastar #chiranjeevigaru #happy #cloud9 #inspiration #apollolifestudio

Posted by Tanish on Monday, 9 September 2019