విజయ్ కి తండ్రిగా నటించే…. ఆ సీనియర్ హీరో ఎవరు?

‘డియర్ కామ్రేడ్’ సినిమాతో అనుకున్నంత హిట్ అందుకోలేకపోయిన సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ… ఈ మధ్యనే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమాకి ‘ఫైటర్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశాడు పూరి. మాఫియా ముఖ్య అంశంగా నడిచే ఈ సినిమా లో ఒక ముఖ్య పాత్ర కోసం ఒక సీనియర్ హీరో ని తీసుకోబోతున్నాడట పూరిజగన్నాథ్. అయితే ఆ సీనియర్ హీరో విజయ్ దేవరకొండ తండ్రి పాత్రలో కనిపించబోతునట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ సీనియర్ హీరో ఎవరన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు.

మరోవైపు ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ హాంగ్ కాంగ్ లో రెండు నెలలు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు. పూరిజగన్నాథ్ మార్క్ ఉండే ఒక ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాస్ మసాలా ఎక్కువగా ఉండే లాగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు పూరి జగన్నాథ్. ఛార్మి కౌర్ మరియు పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం విజయ్ చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి పూర్తయిన తర్వాత పూరి సినిమా షూటింగ్ ని వచ్చే ఏడాది జనవరిలో మొదలు పెట్టాలని విజయ్ దేవరకొండ ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి సందర్భంగా విడుదల చేయనున్నారు.