Telugu Global
NEWS

విశాఖ భూకుంభకోణంపై కీలక నిర్ణయం.... గంట మోగినట్టే....

టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించిన వేల ఎకరాల విశాఖ భూకుంభకోణంపై కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కుంభకోణంపై పునర్‌విచారణ చేయడానికే రాష్ట్రప్రభుత్వం మొగ్గుచూపుతోంది. కొత్తగా సిట్‌ ను ఏర్పాటు చేసి సమగ్రంగా దర్యాప్తు చేయించాలని నిర్ణయించింది. టీడీపీ హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ భూకుంభకోణంలో పాత్రధారులన్న ఆరోపణలు వచ్చాయి. ఈ భూకుంభకోణం […]

విశాఖ భూకుంభకోణంపై కీలక నిర్ణయం.... గంట మోగినట్టే....
X

టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించిన వేల ఎకరాల విశాఖ భూకుంభకోణంపై కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కుంభకోణంపై పునర్‌విచారణ చేయడానికే రాష్ట్రప్రభుత్వం మొగ్గుచూపుతోంది. కొత్తగా సిట్‌ ను ఏర్పాటు చేసి సమగ్రంగా దర్యాప్తు చేయించాలని నిర్ణయించింది.

టీడీపీ హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ భూకుంభకోణంలో పాత్రధారులన్న ఆరోపణలు వచ్చాయి. ఈ భూకుంభకోణం పై నాటి మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ఇదే గంటాపై తీవ్ర ఆరోపణలు చేశారు.

వేల ఎకరాలకు సంబంధించిన కుంభకోణం కావడంతో సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీతో పాటు మిగిలిన విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే చంద్రబాబు మాత్రం సిట్ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ కుంభకోణం జరిగినా కేవలం రెండు మండలాలకు మాత్రమే సిట్ విచారణను చంద్రబాబు పరిమితం చేశారు.

2014లో సంభవించిన హుద్‌హూద్‌ తుపానులో రికార్డులు కొట్టుకుపోయాయంటూ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. చివరకు వేల ఎకరాల కుంభకోణాన్ని… మధురవాడలోని 178, కొమ్మాదిలోని 92 ఎకరాలకు సంబంధించిన 25 రికార్డులు మాత్రమే టాంపరింగ్‌ అయినట్లు ‘సిట్‌’ అధికారులు ప్రకటించి ముగించేశారు. ఆ నివేదికను నాటి కేబినెట్ ఆమోదించింది. కానీ వివరాలు బయటపెట్టకుండా నివేదికను తొక్కేసింది.

ప్రభుత్వం మారిన నేపథ్యంలో విశాఖ భూకుంభకోణంపై తిరిగి విచారణ జరిపించాలన్న డిమాండ్ ఊపందుకుంది. మాజీ మంత్రి గంటా కూడా రెండు రోజుల క్రితం సీఎం జగన్‌కు లేఖ కూడా రాశారు. తనపై ఆరోపణలు అవాస్తవమని… మళ్లీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత సిట్‌ నివేదికలో ఏముందో కూడా తనకు తెలియదన్నారు.

ఈనేపథ్యంలో కొత్త ప్రభుత్వం పునర్‌ విచారణకు ఆదేశించింది. త్వరలోనే సిట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. సరైన దారిలో విచారణ జరిపితే మాత్రం పలువురు టీడీపీ పెద్దలు కూడా ఈ కుంభకోణంలో దొరికిపోవడం పక్కాగా కనిపిస్తోంది.

First Published:  9 Sep 2019 11:40 PM GMT
Next Story