చింతమనేని అరెస్ట్

వివాదాస్పద టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన భార్యను కలిసేందుకు దుగ్గిరాలలోని ఇంటికి రాగా అప్పటికే ఇంటి వద్ద మోహరించిన పోలీసులు చింతమనేనిని అరెస్ట్ చేశారు. చింతమనేనిపై 49 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఇటీవల ఆయనపై అట్రాసిటీ కేసు నమోదైంది. దాంతో అరెస్ట్ తప్పదన్న భావనతో కొద్దిరోజులుగా పరారీలో ఉన్నాడు. చివరకు తన భార్యకు అరోగ్యం బాగోలేదని ఆమెను చూసేందుకు వచ్చే సమయంలోనే పోలీసులకు లొంగిపోతానని చింతమనేని చెప్పాడు.

చింతమనేని భార్య లోబీపీతో ఆస్పత్రిలో చేరారు. చింతమనేని అరెస్ట్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. గోదావరి జిల్లాల హీరో చింతమనేని అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.