Telugu Global
International

ఏకారణాల వల్ల బీజేపీ దేశ రాజకీయాలను శాసిస్తోంది?

భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. 1996లో వాజ్‌పేయి నేతృత్వంలో 14 రోజుల సంకీర్ణ పాలన సాగించిన బీజేపీ.. ఇవాళ సొంతంగా మెజార్టీ సాధించి ప్రబలశక్తిగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని చూసి చాలా మంది రాజకీయ విశ్లేషకులే ఆశ్చర్యపోయారు. సరికొత్త అధ్యయనం ప్రకారం బీజేపీ సాధించిన ఈ బ్రహ్మాండమైన విజయం భారతీయ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపినట్లైంది. భారతీయ రాజకీయ చరిత్రలో 1989 నుంచి […]

ఏకారణాల వల్ల బీజేపీ దేశ రాజకీయాలను శాసిస్తోంది?
X

భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. 1996లో వాజ్‌పేయి నేతృత్వంలో 14 రోజుల సంకీర్ణ పాలన సాగించిన బీజేపీ.. ఇవాళ సొంతంగా మెజార్టీ సాధించి ప్రబలశక్తిగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని చూసి చాలా మంది రాజకీయ విశ్లేషకులే ఆశ్చర్యపోయారు. సరికొత్త అధ్యయనం ప్రకారం బీజేపీ సాధించిన ఈ బ్రహ్మాండమైన విజయం భారతీయ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపినట్లైంది.

భారతీయ రాజకీయ చరిత్రలో 1989 నుంచి 2014 వరకు గడచిన సమయం అంతా సంకీర్ణ ప్రభుత్వాల మయమే. అలాంటి స్థితి నుంచి ఆధిపత్యం చెలాయించే పార్టీ వ్యవస్థ కిందకు రాజకీయాలు వచ్చి చేరాయి. ఇది ఏదో మాటవరసకు చెబుతున్నది కాదు. ఇటీవల కర్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అనే అమెరికా పరిశోధన సంస్థకు చెందిన మిలన్ వైష్ణవ్, జేమీ హింట్‌సన్ అనే వ్యక్తులు చేసిన పరిశోధన చెబుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన డేటా, ఎన్నికల తర్వాత జరిపిన అధ్యయనాల ఆధారంగా వారు ఈ విషయాన్ని చెబుతున్నారు.

దేశ రాజకీయాలపై బీజేపీ సాధించిన పట్టు ఎలాంటిదో చెప్పుకోవాలంటే చిన్న ఉదాహరణ ఉంది. ఒకప్పుడు ఈశాన్య, తూర్పు ప్రాంతంలో బీజేపీ అంటేనే తెలియదు. ఇప్పుడు దేశంలోని ప్రతీ ప్రాంతంలోని హిందూ కుల వర్గాల నుంచి బలమైన మద్దతు కూడగట్టుకుంది బీజేపీ. కేవలం జాతీయ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్రాల్లో కూడా పాతుకుకొని పోతోంది. దేశలో ఉన్న అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలలో 32 శాతం మంది బీజేపీకి చెందిన వారే అంటే… ఆ పార్టీ రాజకీయాలను ఎలా శాసిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికే లోక్‌సభలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న బీజేపీ.. ఇక రాబోయే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనుక విజయకేతనం ఎగురవేస్తే 2020 కల్లా రాజ్యసభలో కూడా మెజార్టీ పార్టీగా ఎదగడం ఖాయమని వాళ్లు జరిపిన అధ్యయనంలో తేలింది.

దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు ముక్కలు కావడం, బలమైన రాజకీయ శత్రువు లేకపోవడంతో పాటు ఓటు వేసే వారి సంఖ్య కూడా భారీగా పెరగడమే బీజేపీ ఎదుగుదలకు కారణమని వారు విశ్లేషిస్తున్నారు. ఇక అసలైన కారణం ఏంటంటే.. దేశంలోని ప్రజల్లో జాతీయ భావాన్ని బలంగా నాటడంలో బీజేపీ సఫలమైంది. ఓటర్లలో ఇది బీజేపీ పట్ల అనుకూల భావాన్ని పెంచిందంటున్నారు.

ఇక నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఆకర్షణ.. అభివృద్ధి, అవినీతి రహిత పాలన అనే నినాదాలు బీజేపీ విజయానికి ఉత్ప్రేరకాలుగా పని చేశాయి. అందుకే బీజేపీని ఒక జాతీయ పార్టీగా నిలిపాయి. ఈ కారణాల వల్లే భారతీయ ఓటింగ్ సరళిలో పూర్తి మార్పు వచ్చింది. యువత కూడా సరికొత్త రాజకీయాల వైపు చూస్తోంది.

First Published:  11 Sep 2019 12:55 AM GMT
Next Story