దళితుల వల్లనే ఈ దరిద్రం – ఎస్‌ఐపై నన్నపనేని రాజకుమారి తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వారు అదుపుతప్పారు. ఎస్పీని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు యూజ్‌లెస్‌ ఫెలో అని దూషించారు. సాటి పోలీసుల ముందే నడిరోడ్డుపై ఇలా ఎస్పీని బూతులు తిట్టాడు అచ్చెన్నాయుడు. అదే సమయంలో అక్కడికి టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి కూడా వచ్చారు.

తనను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా నన్నపనేని నోరుపారేసుకున్నారు. ‘దళితుల వల్లనే దరిద్రం’ అంటూ అక్కడే విధుల్లో ఉన్న దళిత మహిళా ఎస్‌ఐ అనురాధపై నన్నపనేని దూషించారు. దాంతో నొచ్చుకున్న ఎస్‌ఐ అనురాధ బాధపడుతూ అక్కడి నుంచి అవమానభారంతో వెళ్లిపోయారు.

మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన మీరే ఇలా మాట్లాడడం ఏమిటని ఎస్‌ఐ ఆవేదన చెందారు. తనను దూషించిన నన్నపనేని రాజకుమారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎస్‌ఐ అనురాధ చెప్పారు.