Telugu Global
NEWS

కోడెల, చింతమనేని, కూన, సోమిరెడ్డి.... ఏది తప్పుడు కేసో చెప్పు బాబు

తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులతో పునరావాస క్యాంపులు పెడుతోందని, రాష్ట్రంలో ఏదో ఒకటి చేసి రాజకీయ లబ్దిపొందాలన్నదే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకుల కుటిల ఆలోచన అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. “మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటిల రాజకీయాలను ప్రజలను నాలుగు దశాబ్దాలుగా గమనిస్తున్నారు. ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఛలో ఆత్మకూరు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు” అని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. […]

కోడెల, చింతమనేని, కూన, సోమిరెడ్డి.... ఏది తప్పుడు కేసో చెప్పు బాబు
X

తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులతో పునరావాస క్యాంపులు పెడుతోందని, రాష్ట్రంలో ఏదో ఒకటి చేసి రాజకీయ లబ్దిపొందాలన్నదే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకుల కుటిల ఆలోచన అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు మండిపడ్డారు.

“మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటిల రాజకీయాలను ప్రజలను నాలుగు దశాబ్దాలుగా గమనిస్తున్నారు. ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఛలో ఆత్మకూరు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు” అని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలనే సెక్షన్ 30 అమలులో ఉందని, అది గత నాలుగు సంవత్సరాలుగా అమలులో ఉందని మంత్రి బొత్సా గుర్తు చేశారు.

విజయనగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి బొత్సా సత్యనారాయణ “చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలనుకునే వారిని ఉపేక్షించేది లేదు” అని స్పష్టం చేశారు.

తెలుగుదేశం నాయకుడు యరపతినేని నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ వ్యవహారాలను పరిశీలించేందుకు వెళ్లిన తమను అప్పట్లో అరెస్టు చేయించి అక్రమ కేసులు బనాయించారని గుర్తు చేశారు.

“అయ్యా… చంద్రబాబు గారు. మీ నాయకుడు, సాక్షాత్తూ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు శాసనసభ ఫర్నీచర్ తీసుకుపోయింది నిజం కాదా..? మీ శాసనసభ్యుడు చింతమనేని దళిత వర్గాలకు చెందిన అధికారులను బెదిరించలేదా..? మరో మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ అధికారులను బెదిరించినది వాస్తవం కాదా..? మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కోర్టు ఆదేశాలు ఇవ్వలేదా..? వీటిలో ఏది తప్పుడు కేసో చెప్పండి సార్” అని మంత్రి బొత్సా నిలదీసారు.

గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు అప్పుడు దోచుకున్న డబ్బుతో ఇప్పుడు పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం అళ్ల నాని అన్నారు.

అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలలో 90 శాతం నెరవేర్చారని అన్నారు.

“ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబు నాయుడికి లేదు” అని డిప్యూటీ సీఎం అన్నారు.

పల్నాడులో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్తున్నారని, ఆయన ఏర్పాటు చేసిన శిబిరంలో ఉన్న వారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు అంబటి రాంబాబు అన్నారు.

“చంద్రబాబు నాయుడు తమను అడ్డం పెట్టుకుని పునరావాస రాజకీయాలు నడుపుతున్నారని అక్కడున్న వారికి తెలిసింది. అందుకే వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మేం పల్నాడు వాసుల కోసం అక్కడికి వెళ్తాం” అని అంబటి రాంబాబు అన్నారు.

మరో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గుంటూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అరాచకాలను తాము ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టేందుకు తాము ఛలోఆత్మకూరు కార్యక్రమం చేపట్టామని, దీనిని విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు.

First Published:  10 Sep 2019 8:49 PM GMT
Next Story