ఈస్ట్ కోస్ట్ చేతికి “విజిల్”

విజ‌య్ హీరోగా `రాజా రాణి` ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా `బిగిల్‌`. ఇది వ‌ర‌కు ఈ హిట్ కాంబినేష‌న్‌లో విడుద‌లైన `తెరి`(పోలీస్‌), `మెర్స‌ల్‌`(అదిరింది) చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా `బిగిల్‌` ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అందుకే ఈ ప్రాజెక్టుకు టాలీవుడ్ లో కూడా క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తెలుగు రైట్స్ ను ఈస్ట్ కోస్ట్ బ్యానర్ దక్కించుకుంది.

న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భ‌గా తెలుగు, త‌మిళంలో సినిమాను ఏక కాలంలో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు రైట్స్ తో పాటు చిత్తూరులో తమిళ వెర్షన్ రైట్స్ ను కలిపి తీసుకున్నాడు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేష్ కోనేరు. ఇవన్నీ కలుపుకొని దాదాపు 7 కోట్ల రూపాయల వరకు చెల్లించినట్టు తెలుస్తోంది.

బిగిల్ అంటే విజిల్ (ఈల) అని అర్థం. సో.. తెలుగులో ఈ సినిమాకు ఈల లేదా విజిల్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. త్వరలోనే తెలుగు టైటిల్ తో పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు.