హీరోలు వద్దంటున్నారు… దర్శకుడే హీరో అవుతున్నాడు?

దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కించడానికి తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈ దర్శకుడు మొదటి సినిమాతో పెద్ద విజయం సాధించినప్పటికీ…. రెండో సినిమా విషయంలో మాత్రం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు.

ఇప్పటికే ఒకరిద్దరు హీరోలు తన స్క్రిప్ట్ కి ఓకే చెప్పి తరువాత తప్పుకున్నారు… దీంతో మొన్నామధ్య ‘చీప్ స్టార్’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ కూడా పెట్టాడు.

అయితే ఈ సినిమాకి మహా సముద్రం అని టైటిల్ ను కూడా ఖరారు చేశాడు.

ఈ లోగా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం…. అజయ్ భూపతి నటుడిగా తానే అరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నాడట. మహా సముద్రం లో ఇద్దరు హీరోలని అనుకున్న అజయ్… ఒక పాత్ర కి సిద్దార్థ్ ని ఒక పాత్ర కి రవితేజ ని అనుకున్నాడట. ఇప్పుడు రవితేజ పాత్ర చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం తో ఇక ఆ పాత్ర లో తానే నటించాలని కీలక నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. అదే నిజమైతే కచ్చితం గా ఈ సినిమాపై భారీ ప్రచారమే జరుగుతదని అంటున్నారు.