Telugu Global
NEWS

బీజేపీ ఎంపీతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మీటింగ్‌.... టీఆర్‌ఎస్‌లో కలకలం !

నిజామాబాద్‌ జిల్లా రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌తో బోధన్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ సమావేశమయ్యారు. మంత్రి పదవి రాకపోవడంతో షకీల్‌ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అరవింద్‌తో షకీల్‌ మీటింగ్‌ చర్చనీయాంశంగా మారింది.  షకీల్‌ బీజేపీలో చేరుతారని ఊహగానాలు విన్పిస్తున్నాయి. అయితే షకీల్‌ మాత్రం టీఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు టీఆర్‌ఎస్‌లో సరైన గుర్తింపు దక్కడం లేదని చెప్పారు. మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచిన తనకు […]

బీజేపీ ఎంపీతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మీటింగ్‌.... టీఆర్‌ఎస్‌లో కలకలం !
X

నిజామాబాద్‌ జిల్లా రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌తో బోధన్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ సమావేశమయ్యారు. మంత్రి పదవి రాకపోవడంతో షకీల్‌ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో అరవింద్‌తో షకీల్‌ మీటింగ్‌ చర్చనీయాంశంగా మారింది. షకీల్‌ బీజేపీలో చేరుతారని ఊహగానాలు విన్పిస్తున్నాయి. అయితే షకీల్‌ మాత్రం టీఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు టీఆర్‌ఎస్‌లో సరైన గుర్తింపు దక్కడం లేదని చెప్పారు. మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచిన తనకు ఎందుకు పదవులు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌లో ఉన్న ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేను తాను అని…తనకు ఒక పదవి కూడా ఇవ్వకపోవడం ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలకు పదవులు ఇస్తారు కానీ… ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన తనను ఎందుకు పక్కనపెడుతున్నారో తెలియడం లేదని అన్నారు. సోమవారం తాను మీడియా ముందుకు వస్తానని అసలు విషయాలు బయటపెడతానని చెప్పారు.

మంత్రివర్గ విస్తరణ తర్వాత గులాబీ దళంలో పెద్ద ఎత్తున అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయి. జోగురామన్న, బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు పలువురు నేతలు అసమ్మతి స్వరం వినిపించారు. అయితే వీరిలో కొంతమందికి కార్పొరేషన్‌ పదవులు, రైతు సమన్వయ సమితి, ఇతర కార్పొరేషన్‌ పదవులను గులాబీ అధిష్టానం ఆఫర్‌ చేసింది. దీంతో కొంత మంది నేతలు చల్లాబడ్డారు. మరికొంతమంది తమ అసంతృప్తిని మరో రూపంలో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.

అయితే అరవింద్‌తో షకీల్‌ భేటీ ఇప్పుడు నిజామాబాద్‌ జిల్లా రాజకీయాలను కుదిపేస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో కవిత ఓడిపోయిన దగ్గర నుంచి జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతల్లో కలవరం మొదలైంది. కవిత ఓటమికి ఇద్దరు ఎమ్మెల్యేలు కారణమయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈవార్తలపై కవిత కోటరి నుంచి రియాక్షన్ రాలేదు. కానీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు షకీల్‌ అని మాత్రం ప్రచారం జరిగింది.

మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్‌ జిల్లాకు మరో బెర్త్‌ ఇవ్వరని తెలుసు. అందుకే బాజిరెడ్డి గోవర్ధన్‌ లాంటి వారు రైతు సమన్వయ సమితి పదవి కోసం ట్రై చేశారు. ఆయనకు ఆ పదవి ఇస్తారని తెలుస్తోంది. దీంతో షకీల్‌ లాంటి వాళ్లు ఏం చేయాలో తెలియక బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం నడుస్తోంది.

అయితే మరోవైపు షకీల్‌పై నకిలీ పాస్‌పోర్టుతో పాటు మనీలాండరింగ్‌ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది.

First Published:  12 Sep 2019 11:13 AM GMT
Next Story