Telugu Global
NEWS

ట్రాఫిక్ చలానాల బాధ్యత రాష్ట్రాలదే

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారు, హెల్మెట్ తో సహా ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోని వారికి విధించే అపరాధ రుసుం ఎంత విధించాలనే బాధ్యతను రాష్ట్రాలకే వదిలేస్తోంది కేంద్రం. ట్రాఫిక్ నిబంధనలపై కొత్తగా తీసుకువచ్చిన చట్టంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం కాసింత వెనక్కి తగ్గింది. ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిపై చలాన్లు విధించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగిస్తున్నామని కేంద్ర రవాణా, హైవే శాఖల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. “కొత్త చట్టాన్ని సక్రమంగా అమలు […]

ట్రాఫిక్ చలానాల బాధ్యత రాష్ట్రాలదే
X

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారు, హెల్మెట్ తో సహా ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోని వారికి విధించే అపరాధ రుసుం ఎంత విధించాలనే బాధ్యతను రాష్ట్రాలకే వదిలేస్తోంది కేంద్రం. ట్రాఫిక్ నిబంధనలపై కొత్తగా తీసుకువచ్చిన చట్టంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం కాసింత వెనక్కి తగ్గింది.

ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిపై చలాన్లు విధించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగిస్తున్నామని కేంద్ర రవాణా, హైవే శాఖల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. “కొత్త చట్టాన్ని సక్రమంగా అమలు చేయడమా..? లేక దాన్ని తుంగలో తొక్కడమా..? అనేది రాష్ట్రాల బాధ్యత” అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

అయితే తాము కఠినమైన చట్టాన్ని తీసుకురావడం వెనుక ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించడమేనని, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ చట్టాన్ని పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మేం ప్రజల కోసం, వారి భద్రత కోసం చట్టాలు తీసుకువచ్చాం. అయితే మీరు దాన్ని నిర్వీర్యం చేస్తారా…?” అని కేంద్ర మంత్రి గడ్కరీ మండిపడ్డారు. ఈ చట్టాన్ని రూపొందించడానికి కారణం కేవలం డబ్బు సంపాదించడం కాదని, ప్రజల కోసమే ఈ చట్టాన్ని తీసుకు వచ్చామని కేంద్ర మంత్రి చెప్పారు.

ఇక నుంచి ట్రాఫిక్ నిబంధనలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేస్తున్నామని, ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఈ చట్టాన్ని తీసుకువచ్చామని ఆయన చెప్పారు. “నిర్భయ చట్టం తీసుకురావడానికి కారణం అత్యాచారాలు తగ్గాలనే. అలాగే ఈ ట్రాఫిక్ చట్టం తీసుకురావడం వెనుక ఉన్న కారణం నిబంధనలు ఉల్లంఘించరాదనే భయం ప్రజలకు కలగాలనే” అని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు కేంద్రం విధించిన నూతన చలాన్లను తగ్గించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అలా చలాన్లు తగ్గించేందుకు ఇప్పటికే గుజరాత్, పంజాబ్ ముందుకు వచ్చాయి. తాజాగా ఆ జాబితాలో కేరళ, పశ్చిమ బెంగాల్, కర్నాటక రాష్ట్రాలు కూడా చేరాయి. ఆయా రాష్ట్ర్రాలలో ట్రాఫిక్ చలాన్లు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇదే నిర్ణయాన్ని తెలుగు రాష్ట్రాలు కూడా తీసుకునే అవకాశం ఉందని రవాణా శాఖకు చెందిన ఉన్నతాధికారులు చెబుతున్నారు.

First Published:  11 Sep 2019 11:50 PM GMT
Next Story