రామ్ కి అడ్డాల కథ నచ్చిందట…. కానీ….

రామ్ పోతినేని ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ రిజల్ట్ ఎఫెక్ట్… ఇప్పుడు చేయబోయే ఏ సినిమాకైనా మంచి క్రేజ్ తో పాటు… బిజినెస్ కూడా జరుగుతుంది. ఇస్మార్ట్ మాస్ స్టోరీ కావడంతో… ఇప్పుడు రామ్ సరికొత్త కథ తో పాటు… మరో లుక్ తో రావాలని అనుకుంటున్నాడట.

ప్రస్తుతం రామ్ కి కథ చెప్పిన దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల కూడా ఒకరు. ‘కూచిపూడి వారి వీధిలో’ అనే పేరు తో ఆయన ఒక సినిమా ని గీత ఆర్ట్స్ బ్యానర్ లో చేయనున్నారు.

ముందుగా ఈ సినిమాకి శిరీష్, నాని, సాయి ధరమ్ ల లో ఒకరిని హీరో గా తీసుకోవాలి అని అనుకున్నారట… కానీ ఇప్పుడు మరో హీరోని ఈ సినిమాకోసం వెతుకుతున్నారు. అందులో భాగంగా రామ్ కి కూడా ఈ సినిమా కథ చెప్పగా…. రామ్ ఈ కథ నచ్చిందని చెప్పాడట… కానీ అడ్డాల ఎలా తీస్తాడో అనే భయం తో ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టాడట.

బ్రహ్మోత్సవం వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఈ దర్శకుడి తో పని చేయడానికి చాలా మంది జంకుతున్నారు. అయితే రామ్ కూడా ఈ విధంగానే వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.