గ్యాప్ తీసుకున్నాడు.. కానీ సైలెంట్ గా ఫినిష్ చేసేశాడు !

మెగా స్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్…. ‘విజేత’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథ, కథనం బాగుండటం తో మంచి పేరే తెచ్చుకున్నాడు కళ్యాణ్ దేవ్. అయితే ఈ సినిమా తర్వాత చాలా గ్యాపే తీసుకున్నాడు.

కళ్యాణ్ దేవ్ రెండో సినిమా కోసం గ్యాప్ తీసుకున్నప్పటికీ… ప్రచారం లేకుండా, పెద్దగా గ్యాప్ తీసుకోకుండా సైలెంట్ గా తన రెండో సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసి ఫినిష్ కూడా చేసేశాడు.

రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. పులి వాసు ఈ సినిమా కి దర్శకుడు. థమన్ ఈ సినిమా కి సంగీత దర్శకుడు. త్వరలోనే  ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టబోతున్నారట.