నెట్ ఫ్లిక్స్ తో సురేష్ బాబు…

గత కొన్ని సంవత్సరాలు గా ఆన్ లైన్ లో సినిమాలు చూసే వారి సంఖ్య పెరిగింది. ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ చేసుకొనే వాళ్ళు ఎక్కువ మంది అవ్వడం, వాటికి డిమాండ్ పెరగడం తో, ఆన్ లైన్ లో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్లకి కూడా డిమాండ్ పెరిగింది.

చాలా మంది దర్శకులు, నిర్మాతలు ఇప్పటికే ఆన్ లైన్ స్ట్రీమింగ్ చేసే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థల తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

ఇక తాజాగా నెట్ ఫ్లిక్స్ అందరి కన్నా ముందు తెలుగు మార్కెట్ పై పాగా వేయాలని చూస్తోందట. అమెజాన్ ఇప్పటికే తెలుగు లో ఒక సిరీస్ ని నిర్మించినా అది ఆశించిన స్థాయిలో ఆడలేదు.

అందుకే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్  నిర్మాత సురేష్ బాబు తో ఒక ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. ఈ డీల్ ప్రకారం సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చే సినిమాలు అన్నీ ఇకపై నెట్ ఫ్లిక్స్ లో ప్రదర్శింపబడతాయని తెలుస్తోంది.

ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి వచ్చిన చిత్రాలు…. ఈ నగరానికి ఏమైంది మరియు కేరాఫ్ కంచరపాలెం నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యాయి. త్వరలోనే ‘ఓ బేబీ’ సినిమా కూడా విడుదల కానుందట. ఇక మల్లేశం, దొరసాని వంటి చిత్రాలు కూడా నెట్ ఫ్లిక్స్ లో ఉండబోతున్నాయని సమాచారం.