మాజీ మంత్రి పీతల సుజాత ఇంట్లో విషాదం

చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన టీడీపీ నేత పీతల సుజాత ఇంట్లో విషాదం నెలకొంది. సుజాత తండ్రి పీతల బాబ్జి గుండెపోటుతో ఈరోజు కన్నుమూశారు.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పీతల బాబ్జి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు.

ఈ వార్త తెలియగానే పీతల సుజాత, ఆమె కుటుంబ సభ్యులు బోరున విలిపించారు. పీతల బాబ్జి భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు అభిమానులు, స్థానికులు తరలివచ్చారు.

కాగా పీతల సుజాతను రాజకీయంగా పవర్ ఫుల్ గా మార్చడంలో.. రాజకీయాల్లోకి తీసుకురావడంలో ఆమె తండ్రి బాబ్జి పాత్ర చాలా ఉంది. తనకు రాజకీయ జన్మనిచ్చిన తండ్రి మరణం తట్టుకోలేకపోతున్నట్టు పీతల సుజాత ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా పీతల బాబ్జి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం చింతలపూడిలోని వారి స్వగృహంలో నిర్వహిస్తారని సమాచారం. దీనికి చంద్రబాబు సహా టీడీపీ నేతలు హాజరు అయ్యే అవకాశాలున్నాయి.