‘ప్రతి రోజూ పండగే’ ఫస్ట్ లుక్…. ఈ సన్నివేషాలే హైలైట్ అట…!

సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ సినిమా అంటే టక్కున గుర్తొచ్చేది ‘సుప్రీం’. రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మళ్లీ చాలా కాలం తర్వాత సాయి ధరంతేజ్ మరియు రాశిఖన్నా కలిసి నటిస్తున్న సినిమా ‘ప్రతి రోజూ పండగే’.

వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న సమయంలో తేజ్ ‘చిత్రలహరి’తో ఒక హిట్ ని అందుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ‘ప్రతి రోజూ పండగే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మారుతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఆ పోస్టర్ లో వర్షంలో గొడుగు పట్టుకుని సాయిధరమ్ తేజ్ కనిపించగా…. సత్య రాజ్ మాత్రం వర్షంలో తడుస్తూ కనిపిస్తున్నాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేషాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని సినిమా యూనిట్ అంటోంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పోస్టర్ రిలీజ్ చేశారని అంటున్నారు.

గీతా ఆర్ట్స్ 2 పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు బన్నీ వాసు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరీ ‘సుప్రీమ్’ సినిమా తో హిట్ అందుకున్న తేజ్, రాశిఖన్నా  జోడి… ‘ప్రతి రోజూ పండగే’ సినిమాతో ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.