హీరో సప్తగిరి…. రచయిత విజయేంద్ర ప్రసాద్

రైటర్ విజయేంద్ర ప్రసాద్…. రాజమౌళి తండ్రి గా ఈయన అందరికీ సుపరిచితులు. అయితే ఆయన రాసిన కొన్ని కథలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాలు సాధించాయి. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ జయలలిత బయోపిక్ కి పని చేస్తున్నాడు.

మరోవైపు ఇప్పుడు కమెడియన్ నుంచి హీరో గా మారిన సప్తగిరి కోసం ఒక కథ ని తయారు చేశాడట. బాలకృష్ణ నటించిన విజయేంద్ర ప్రసాద్…. కళ్యాణ్ రామ్ నటించిన హరే రామ్ సినిమాలకి దర్శకత్వం వహించిన హర్షవర్ధన్ ఈ సినిమా కి దర్శకుడు.

సప్తగిరి హీరో గా ఈ సినిమా ఒక చిన్న బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ సినిమాని ఇటీవలే లాంచ్ చేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథను ఇస్తుండడంతో ఆయనను కూడా ఈ సినిమా మార్కెట్ కోసం వాడుకోవాలని చూస్తున్నారట నిర్మాతలు.