Telugu Global
Cinema & Entertainment

సై రా కోసం.... 42 సెట్స్, 64 గ్రామాలు....

సై రా నరసింహ రెడ్డి సినిమా విడుదలకోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం అనేక మంది కష్టపడ్డారు… ఎన్నో సెట్స్ ని నిర్మించారు. వాళ్ళ కష్టానికి ఫలితం కొద్ది రోజుల్లో తేలిపోనుంది. అయితే ఈ సినిమా కి చారిత్రక నేపథ్యం ఉండటం, నిజ జీవిత సంఘటనల ఆధారం గా తీయాల్సి రావడంతో ఈ సినిమా కోసం ఒక స్పెషల్ లుక్ ఉండేలా ఈ సినిమా యూనిట్ ప్రయత్నించింది. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ తన టీమ్ […]

సై రా కోసం.... 42 సెట్స్, 64 గ్రామాలు....
X

సై రా నరసింహ రెడ్డి సినిమా విడుదలకోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం అనేక మంది కష్టపడ్డారు… ఎన్నో సెట్స్ ని నిర్మించారు. వాళ్ళ కష్టానికి ఫలితం కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

అయితే ఈ సినిమా కి చారిత్రక నేపథ్యం ఉండటం, నిజ జీవిత సంఘటనల ఆధారం గా తీయాల్సి రావడంతో ఈ సినిమా కోసం ఒక స్పెషల్ లుక్ ఉండేలా ఈ సినిమా యూనిట్ ప్రయత్నించింది.

ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ తన టీమ్ తో కలిసి ఈ సినిమా కోసం దాదాపు గా 64 గ్రామాల ని నిర్మించారట. గ్రామీణ నేపథ్యం ఈ సినిమా కి ప్రధానం గా ఉండటం తో ఆ వాతావరణం తలపించేలా చాలా గ్రామాలని నిర్మించారట.

అంతే కాకుండా 42 సెట్స్ ని కూడా ఈ సినిమాకోసం వేశారని తెలుస్తోంది. వీటి కోసం దాదాపు గా 30 కోట్లు ఖర్చుపెట్టారట. ఇవి ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తాయని అంటోంది ఈ సినిమా యూనిట్‌.

First Published:  12 Sep 2019 4:30 AM GMT
Next Story