Telugu Global
National

రోడ్లు బాగుంటేనే రోడ్డు ప్రమాదాలు " కేంద్ర మంత్రి

దేశంలో ఆర్థిక మందగమనం మొదలైన తర్వాత కేంద్రమంత్రులు స్థిమితంగా మాట్లాడలేకపోతున్నారు. అంశాన్ని తప్పుదోవ పట్టించే తనం బాగా ఉన్న కొందరు నేతలు….. దేశాన్ని చుట్టుముడుతున్న ఆర్థిక మందగమనం, జీడీపీ దారుణంగా పడిపోవడం వంటి చర్యలతో దిక్కుతోచని స్థితిలో మంత్రులు మాట్లాడుతున్నారు. ఆటోమొబైల్ రంగం పతనం అవడానికి కారణం దేశంలోని యువతే కారణమని ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చారు. యువత కొత్త వాహనాలను కొనుగోలు చేయకుండా ఓలా, ఊబర్‌ సర్వీసులను వాడుకోవడం వల్లే ఆటోమొబైల్ రంగంలో […]

రోడ్లు బాగుంటేనే రోడ్డు ప్రమాదాలు  కేంద్ర మంత్రి
X

దేశంలో ఆర్థిక మందగమనం మొదలైన తర్వాత కేంద్రమంత్రులు స్థిమితంగా మాట్లాడలేకపోతున్నారు. అంశాన్ని తప్పుదోవ పట్టించే తనం బాగా ఉన్న కొందరు నేతలు….. దేశాన్ని చుట్టుముడుతున్న ఆర్థిక మందగమనం, జీడీపీ దారుణంగా పడిపోవడం వంటి చర్యలతో దిక్కుతోచని స్థితిలో మంత్రులు మాట్లాడుతున్నారు.

ఆటోమొబైల్ రంగం పతనం అవడానికి కారణం దేశంలోని యువతే కారణమని ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చారు. యువత కొత్త వాహనాలను కొనుగోలు చేయకుండా ఓలా, ఊబర్‌ సర్వీసులను వాడుకోవడం వల్లే ఆటోమొబైల్ రంగంలో సంక్షోభవం వచ్చిందని మంత్రి తీర్మానించారు.

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్… అయితే అసలు జీడీపీ లెక్కలే పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు. జీడీపీ ఎలా ఉన్నా దేశం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల వైపు వెళ్తోందని వ్యాఖ్యానించారు. పనిలో పనిగా గురుత్వాకర్షణ శక్తిని గణితం ఆధారంగా ఐన్‌స్టీన్ కనుగొన్నాడంటూ వ్యాఖ్యానించి అవాక్కయ్యేలా చేశారు ఈ కేంద్రమంత్రి.

ఈ రెండు షాకుల నుంచి జనం తేరుకోకముందే కేంద్ర ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ ఒక ప్రకటన చేశారు. భారీగా ఫైన్లు వేస్తున్నారు సరే… మరి సరైన రోడ్లను ప్రభుత్వం ఎందుకు వేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సదానందగౌడ తాను కనిపెట్టిన సీక్రెట్‌ చెప్పారు.

రోడ్లు బాగుంటేనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. గతుకులు లేకుండా రోడ్డు ఉంటే వేగంగా ప్రయాణిస్తారని…. దాని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని సెలవిచ్చారు.

గతుకుల రోడ్లపై మెల్లగా వెళ్తాం కాబట్టి ప్రమాదాలు పెద్దగా జరగవని… అందుకే రోడ్లు గతుకులతో ఉండడమే మంచిదని సదానంద తేల్చారు. కేంద్రమంత్రి ప్రకటనపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. తమదైన స్టైల్ లో ఆడుకుంటున్నారు.

First Published:  13 Sep 2019 12:48 AM GMT
Next Story