చిరంజీవికి హ్యాండ్ ఇచ్చిన కేటీఆర్

18న సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఎల్బీ స్టేడియంను వేదికగా ఫిక్స్ చేశారు. అదే వేదికపై నుంచి ట్రయిలర్ ను కూడా విడుదల చేయబోతున్నారు. పవన్, కేటీఆర్, కొరటాల, వినాయక్ లాంటి ప్రముఖులు రాబోతున్నారంటూ ప్రకటించారు.

ఇలా ఎనౌన్స్ చేసిన కొన్ని గంటలకే ఈ కార్యక్రమానికి కేటీఆర్ రావడం లేదని ప్రకటించారు. అవును.. సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కేటీఆర్ హాజరుకావడం లేదు. రీసెంట్ గా మంత్రిగా మారిన కేటీఆర్ కు కొన్ని అత్యవసర అధికారిక కార్యక్రమాలు ఉన్నాయట. అందుకే ఆయన సైరా ఫంక్షన్ కు రావడం లేదంటున్నారు చాలామంది.

ఇక మిగతా సెలబ్రిటీల విషయానికొస్తే.. సైరాలో నటించిన అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్న, నిహారిక.. ఇలా చాలామంది ప్రముఖులు ఈ ఈవెంట్ కు రాబోతున్నారు. వీళ్లతో పాటు మెగా కాంపౌండ్ కు చెందిన మరికొంతమంది హీరోలు కూడా వస్తారని తెలుస్తోంది. ఇలా అత్యంత కలర్ ఫుల్ గా జరగబోతోంది సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్.

నిజానికి ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను చాలా తొందరగా పెడుతున్నారు. రిలీజ్ కు ఇలా 2 వారాల ముందే ఫంక్షన్ పెట్టడానికి ఓ కారణం ఉంది. సైరా సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. దాదాపు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రచారం ప్లాన్ చేశారు. ప్రమోషన్ కు సమయం సరిపోదనే ఉద్దేశంతో ఇలా కాస్త ముందుగానే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టేశారు. పైగా ఆ తేదీకే ప్రముఖుల డేట్స్ అన్నీ సెట్ అవ్వడంతో 18నే ఫిక్స్ చేశారు.