మళ్ళీ 30 ఏళ్ళ తరువాత ఇలా…. మహేష్ బాబు ట్వీట్

30 ఏళ్ళ క్రితం సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం లో వచ్చిన కొడుకు దిద్దిన కాపురం సినిమా లో మహేష్ బాబు, విజయశాంతి కలిసి నటించారు. ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో విజయ శాంతి ఏ పాత్ర పోషిస్తుంది అనే విషయం మీద క్లారిటీ లేదు… కానీ మహేష్ బాబు మాత్రం ఒక పోస్ట్ పెట్టారు. ముప్పై ఏళ్ళ తర్వాత విజయశాంతి తో నటిస్తున్నందుకు సంతోషం గా ఉందని ఆయన అన్నారు.

“అదంతా 1989 సంవత్సరం లో కొడుకు దిద్దిన కాపురం అనే సినిమా లొకేషన్ లో మొదలయ్యింది. కట్ చేస్తే…. ఇప్పుడు 2019 నాటికి అంటే మూడు దశాబ్దాల తర్వాత నేను మళ్ళీ విజయశాంతి గారి తో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా లో పని చేస్తున్నాను. జీవితం ఫుల్ సర్కిల్ అయ్యింది. పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి” అని మహేష్ బాబు ట్వీట్ చేయడంతో పాటు  ఫోటో కూడా పోస్ట్ చేసాడు.

ఈ సినిమా ని దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. రష్మిక ఈ సినిమా లో హీరోయిన్. వచ్చే ఏడాది సంక్రాంతి కి ఈ సినిమా విడుదల కానుంది.