Telugu Global
CRIME

ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్... మహిళా పారిశ్రామిక వేత్త ఆత్మహత్య

ఆర్థిక మాంద్యం తన ప్రభావాన్ని మెల్లిమెల్లిగా చూపిస్తోంది. రాజకీయ పార్టీలు, రాష్ట్ర్ర ప్రభుత్వాలు ఆర్థిక మాంద్యంపై వ్యక్తం చేస్తున్న ఆందోళన వాస్తవమేనని జరుగుతున్న సంఘటనలు చెబుతున్నాయి. ఆర్థిక మాంద్యం దెబ్బకు మహిళా పారిశ్రామిక వేత్త ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని లాన్సన్ టొయోటా డీలర్ షిప్ యాజమాని రీటా లంకలింగం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యకు కారణం ఆర్థిక మాంద్యమేనని భావిస్తున్నారు. గత కొంతకాలంగా తమ కార్ల అమ్మకాలు తగ్గడం, భవిష్యత్ లో అవి పెరుగుతాయని నమ్మకం […]

ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్... మహిళా పారిశ్రామిక వేత్త ఆత్మహత్య
X

ఆర్థిక మాంద్యం తన ప్రభావాన్ని మెల్లిమెల్లిగా చూపిస్తోంది. రాజకీయ పార్టీలు, రాష్ట్ర్ర ప్రభుత్వాలు ఆర్థిక మాంద్యంపై వ్యక్తం చేస్తున్న ఆందోళన వాస్తవమేనని జరుగుతున్న సంఘటనలు చెబుతున్నాయి.

ఆర్థిక మాంద్యం దెబ్బకు మహిళా పారిశ్రామిక వేత్త ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని లాన్సన్ టొయోటా డీలర్ షిప్ యాజమాని రీటా లంకలింగం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యకు కారణం ఆర్థిక మాంద్యమేనని భావిస్తున్నారు.

గత కొంతకాలంగా తమ కార్ల అమ్మకాలు తగ్గడం, భవిష్యత్ లో అవి పెరుగుతాయని నమ్మకం సన్నగిల్లడంతో రీటా ఆత్మహ్యత చేసుకున్నారని ప్రాధమికంగా నిర్దారించారు.

చెన్నైలోని నుంగంబాకం కొఠారి రోడ్డులో రీటా, ఆమె భర్త లంకలింగం నివసిస్తున్నారు. వీరిద్దరూ తమిళనాడులో టయోటా కంపెనీ డీలర్లుగా వ్యవహరిస్తున్నారు. రీటా భర్త లంకలింగం చైర్మన్ గా, రీటా మేనేజింగ్ డైరక్టర్ గా ఉన్నలాన్సన్ టొయోటా డీలర్ కంపెనీ దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తరించింది. మరిన్ని ప్రాంతాల్లో దీనిని ప్రారంభించాలని కూడా వారిద్దరూ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే ఇటీవల కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దీంతో వ్యాపారంలో రోజురోజుకు నష్టాలు ఎక్కువవుతున్నాయి. ఈ విషయంలో భార్యభర్తల మధ్య గత కొంతకాలంగా వివాదం కూడా నెలకొందని సన్నిహితులు చెబుతున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో బుధవారం నాడు తన ఇంట్లో గదిలోకి వెళ్ళిన రీటా గురువారం ఉదయం 11 గంటల వరకూ బయటకు రాలేదు. పనిమనిషి ఎన్నిసార్లు తలుపులు బాదినా అవతలి నుంచి సమాధానం రాలేదు. దీంతో పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు వచ్చి గది తలుపులు బద్దలు కొట్టడంతో రీటా ఉరి వేసుకుని కనిపించారు. ఈ సమయంలో భర్త లంకలింగం ఇంట్లో లేరు. ఈ ఆత్మహత్యకు ఆర్థిక మాంద్యమే కారణంగా భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా చాలా మంది వ్యాపారవేత్తలు ఆర్థిక కుదుపులతో ఇబ్బందులు పడుతున్నారని ఆర్థిక నిపుణులు చెప్పడం గమనార్హం.

First Published:  13 Sep 2019 12:07 AM GMT
Next Story