వైసీపీలోకి తోట, కాపు నేతలు… వ్యతిరేకిస్తున్న వైసీపీ క్యాడర్

గోదావరి జిల్లాలంటేనే కాపులకు పెట్టని కోట.. బలమైన కాపు సామాజికవర్గం అంతా 2014లో టీడీపీకి సపోర్టుగా నిలవడంతో ఆ పార్టీ విజయం సాధించింది. 2019లో కాపులు వైసీపీ బాట పట్టారు. అయితే మెజార్టీ కాపు ఎమ్మెల్యేలు, సామాజికవర్గం టీడీపీలోనే కొనసాగారు. వారు ఈ ఎన్నికల్లో వైసీపీ ధాటికి, జగన్ గాలికి తట్టుకోలేక ఓడిపోయారు.

కాగా టీడీపీలో ఓడిన కాపు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ఇటీవల…. కాపు నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సారథ్యంలో కాకినాడలో భేటి అయ్యి పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు. వారంతా బీజేపీ లేదా పవన్ పార్టీ జనసేనలో చేరుదామని డిసైడ్ అయ్యారు.

అయితే మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో కాపు నేతలంతా మనసు మార్చుకున్నారు. కాపు నేతలతో తోటత్రిమూర్తులు భేటి కాబోతున్నారట.. అనంతరం తోటతో సహా మాజీ ఎమ్మెల్యేలు, నేతలు 18న విజయవాడలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.

అయితే టీడీపీకి కొమ్ముకాసిన కాపు నేతలు వైసీపీలో చేరడాన్ని స్థానిక వైసీపీ క్యాడర్ వ్యతిరేకిస్తోందట.. వీరంతా పదవులు, అధికారం కోసమే వైసీపీలో చేరుతున్నారని, వీరిని చేర్చుకోవద్దంటూ…. వైసీపీ రామచంద్రపురం ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ ఇంటిని వైసీపీ కార్యకర్తలు ముట్టడించారు. తోటను పార్టీలో చేర్చుకోవద్దంటూ ఆందోళన చేశారు. మరి జగన్ ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తిగా మారింది.