Telugu Global
NEWS

నేటినుంచే ప్రపంచ కుస్తీ సమరం

65 కిలోల విభాగంలోహాట్ ఫేవరెట్ గా భజరంగ్ పూనియా 2019 ప్రపంచ కుస్తీ చాంపియన్షిప్ సమరానికి కజకిస్థాన్ లోని నూర్ -సుల్తాన్ లో రంగం సిద్ధమయ్యింది. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల పురుషుల 65 కిలోల విభాగంలో భారత స్టార్ వస్తాదు భజరంగ్ పూనియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాడు. గతంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలలో రజత, కాంస్య పతకాలు సాధించిన భజరంగ్ ఆరునూరైనా ఈసారి బంగారు పతకంతో స్వదేశానికి తిరిగిరావాలన్న పట్టుదలతో ఉన్నాడు. గత […]

నేటినుంచే ప్రపంచ కుస్తీ సమరం
X
  • 65 కిలోల విభాగంలోహాట్ ఫేవరెట్ గా భజరంగ్ పూనియా

2019 ప్రపంచ కుస్తీ చాంపియన్షిప్ సమరానికి కజకిస్థాన్ లోని నూర్ -సుల్తాన్ లో రంగం సిద్ధమయ్యింది.

ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల పురుషుల 65 కిలోల విభాగంలో భారత స్టార్ వస్తాదు భజరంగ్ పూనియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాడు.

గతంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలలో రజత, కాంస్య పతకాలు సాధించిన భజరంగ్ ఆరునూరైనా ఈసారి బంగారు పతకంతో స్వదేశానికి తిరిగిరావాలన్న పట్టుదలతో ఉన్నాడు. గత నెలరోజులుగా రష్యాలో ప్రత్యేక శిక్షణతో పోటీలకు సమాయత్తమయ్యాడు.

2013 ప్రపంచ కుస్తీ 60 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన భజరంగ్…గత ప్రపంచ కుస్తీ పోటీలలో రజత విజేతగా నిలిచాడు.

2010 ప్రపంచ కుస్తీ టోర్నీలో సుషీల్ కుమార్ స్వర్ణపతం సాధించిన తర్వాత..భారత్ మరో బంగారు పతకం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

రాజీవ్ ఖేల్ రత్న పురస్కారవిజేత భజరంగ్ పూనియా ఈసారి ఖాయంగా స్వర్ణం సాధించగలనన్న ధీమాతో ఉన్నాడు.

ఒలింపిక్స్ బెర్త్ లకు గురి…

వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్ కుస్తీ పోటీలకు అర్హత సాధించడమే లక్ష్యంగా వివిధ దేశాల ప్రముఖ వస్తాదులు ప్రస్తుత ప్రపంచకప్ పోటీలను వేదికగా ఉపయోగించుకోనున్నారు.

65కిలోల విభాగంలో భజరంగ్ పూనియా, 61 కిలోల విభాగంలో రాహుల్ అవారే , 86 కిలోల విభాగంలో జూనియర్ ప్రపంచచాంపియన్ దీపక్ పూనియా , మహిళల 50 కిలోల విభాగంలో సీమా బిస్లా పతకాల వేటకు దిగుతున్నారు.

First Published:  13 Sep 2019 11:00 PM GMT
Next Story