దిల్ రాజు…. రీమేక్ రాజు గా మారుతున్నాడా?

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్ళిపోతున్నాడు దిల్ రాజు.

అయితే ఆయన ఈ మధ్య ఎక్కువగా రీమక్స్ పైన దృష్టి పెడుతున్నాడు. దిల్ రాజు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం కన్ ఫార్మ్ కావడంతో… ఆయన బాలీవుడ్ లో మూడు తెలుగు సినిమాలని రీమేక్ చేయబోతున్నాడు. ఆ సినిమాలు చాలవు అన్నట్టు, ఇక తెలుగు లో కూడా రీమేక్ ల బాట పట్టాడు.

ప్రస్తుతం తెలుగు లో కూడా రెండు రీమక్స్ పైన దృష్టి పెట్టాడట. అందులో ఒకటి 96 రీమేక్. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ నడుస్తుంది. ఇది కాకుండా తెలుగు లో ‘బదాయి హో’ అనే సినిమా ని నిర్మించనున్నాడు దిల్ రాజు.

ఈ రెండు రీమక్స్ కాకుండా ‘అందాదున్’ రీమేక్ పైన కూడా ఆయన కన్ను పడిందట. ఆ సినిమా ఎవరు చేసినా ఆ ప్రాజెక్ట్ లో ఆయన ఉండేలా చూసుకుంటున్నాడట.

ఇవే కాకుండా ‘పింక్’ సినిమా రీమేక్ హక్కులు కూడా దిల్ రాజు దగ్గర ఉన్నాయి అనే టాక్ నడుస్తుంది. దిల్ రాజు…. రీమేక్ రాజు గా మారనున్నాడన్న వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.