గ్యాంగ్ లీడర్ మొదటి రోజు వసూళ్లు

సినిమాపై పెద్దగా బజ్ లేకపోవడంతో వసూళ్లు కూడా అదే రేంజ్ లో వచ్చాయి. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ గా ఓపెన్ అయింది. ఈ సినిమాకు తొలి రోజు ఓ మోస్తరు వసూళ్లు వచ్చాయి. గతంలో నాని నటించిన ఎంసీఏ రికార్డుల్ని మాత్రం గ్యాంగ్ లీడర్ తిరగరాయలేకపోయింది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇది ఫెయిల్ అయింది.

గ్యాంగ్ లీడర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4 కోట్ల 55 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ప్రీ-రిలీజ్ బిజినెస్, నాని మార్కెట్ తో పోల్చి చూసుకుంటే ఇది డీసెంట్ కింద లెక్క. అటు వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 20 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 1.67 కోట్లు
సీడెడ్ – రూ. 0.51 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.61 కోట్లు
ఈస్ట్ – రూ. 0.52 కోట్లు
వెస్ట్ – రూ. 0.30 కోట్లు
గుంటూరు – రూ. 0.46 కోట్లు
నెల్లూరు – రూ. 0.15 కోట్లు
కృష్ణా – రూ. 0.33 కోట్లు