Telugu Global
NEWS

డబ్బులు ఇవ్వకుండా మోసం.... మీడియాకెక్కిన టీడీపీ శిబిరం పెయిడ్ ఆర్టిస్టులు

జాతి మీడియా నుంచి జాతీయ మీడియా వరకు అందరినీ తన మేనేజ్‌మెంట్‌ స్కిల్స్ సాయంతో కట్టిపడేసిన చంద్రబాబు… చలో ఆత్మకూరు అంటూ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. జాతీయ మీడియా కూడా చంద్రబాబు కోసం గొలుసులు తెంపుకుని ఆ రోజు పనిచేసింది. వైసీపీ వాళ్లు తరిమేస్తే టీడీపీ కార్యకర్తలకు ఆశ్రయం కల్పిస్తున్నామంటూ శిబిరాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు. అందులో కొందరు గ్రామాలు వదిలి వచ్చిన వారు ఉన్నా అత్యధికులు మాత్రం పెయిడ్ ఆర్టిస్టులేనని తేలిపోయింది. శిబిరం […]

డబ్బులు ఇవ్వకుండా మోసం.... మీడియాకెక్కిన టీడీపీ శిబిరం పెయిడ్ ఆర్టిస్టులు
X

జాతి మీడియా నుంచి జాతీయ మీడియా వరకు అందరినీ తన మేనేజ్‌మెంట్‌ స్కిల్స్ సాయంతో కట్టిపడేసిన చంద్రబాబు… చలో ఆత్మకూరు అంటూ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. జాతీయ మీడియా కూడా చంద్రబాబు కోసం గొలుసులు తెంపుకుని ఆ రోజు పనిచేసింది.

వైసీపీ వాళ్లు తరిమేస్తే టీడీపీ కార్యకర్తలకు ఆశ్రయం కల్పిస్తున్నామంటూ శిబిరాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు. అందులో కొందరు గ్రామాలు వదిలి వచ్చిన వారు ఉన్నా అత్యధికులు మాత్రం పెయిడ్ ఆర్టిస్టులేనని తేలిపోయింది. శిబిరం వద్ద ఉన్న వారిని చూసేందుకు వచ్చిన వారిని కూడా శిబిరంలో వేసేశారు. బిర్యానీలు పెట్టి, పది వేలు ఇస్తామని చెప్పడంతో చాలా మంది అక్కడే ఉండిపోయారు.

మూడు పూటలు ఫుడ్ పెట్టారు కానీ… చెల్లిస్తామన్న సొమ్ము మాత్రం చెల్లించలేదు. దాంతో మోసపోయిన వారు జరిగిన విషయాన్ని మీడియా ముందే చెబుతున్నారు. దాంతో చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్ ప్రచారం మరోసారి బయటపడింది. తాను నాయకులను కలుద్దామని శిబిరం వద్దకు వెళ్తే అక్కడి నుంచి బయటకు రానివ్వలేదని పిడుగురాళ్లకు చెందిన నరసింహరావు చెప్పారు. ”నాయకులను చూద్దామని పునరావాస కేంద్రానికి వెళ్లాను. నాపై ఎలాంటి కేసులు లేవు. నేను పునరావాస కేంద్రానికి వెళ్లి, తిరిగి వచ్చే సమయానికి పొద్దుపోయింది. మరుసటి రోజు వెళ్దాంలే అని అక్కడే పడుకున్నా. మరుసటి రోజు పొద్దున్నే మా గ్రామానికి వెళ్దామని బయల్దేరుతుండగా బయటకు రానివ్వకుండా గేట్లు వేసేశారు” అని వివరించాడు నరసింహరావు.

”ఆసుపత్రిలో పని ఉంటే గుంటూరు వెళ్లాను. పునరావాస కేంద్రంలో ఉన్న నా స్నేహితుడు ఫోన్‌ చేసి భోజనాలు పెడుతున్నారని చెప్పాడు. దీంతో అక్కడికి వెళ్లాను. భోజనం చేశాక ఇక్కడే ఉంటే డబ్బులు ఇస్తామన్నారు. అక్కడే ఉన్నా టీడీపీ నేతలు మాకు ఇస్తామన్న రూ.10 వేలు ఇవ్వకుండా మోసం చేశారు” అని పిన్నెల్లి గ్రామానికి చెందిన కొమ్ము ఏసుబాబు బయటపెట్టారు.

మరికొందరు నేరుగా మీడియా ముందుకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. చంద్రబాబు ఏర్పాటు చేసిన శిబిరంలో అత్యధికులు డబ్బు ఇస్తామని తీసుకొచ్చిన వారేనని అయితే ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదని…. ఇలా మోసపోయిన వారు చెబుతున్నారు.

First Published:  13 Sep 2019 11:57 PM GMT
Next Story