హైకోర్టులో వాల్మీకి…. నోటీసులు జారీ చేసిన కోర్టు

వరుణ్ తేజ్, పూజా హెగ్డే హీరో హీరోయిన్ లుగా త్వరలో రాబోతున్న సినిమా వాల్మీకి. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా లో…. మృణాళిని రవి, అథర్వ మురళి మరియు డింపుల్ హయాతి లు కూడా నటించారు. జిగర్తాండ అనే తమిళ సినిమా కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా కి దర్శకుడు హరీష్ శంకర్.

14 రీల్స్ ప్లస్ బానర్ పైన ఈ సినిమా ని నిర్మించారు. అయితే ఎప్పటి నుంచో ఈ సినిమా టైటిల్ గురించి ఒక వివాదం నడుస్తూ ఉంది. కాకపోతే దాని మీద అధికారికం గా మాత్రం క్లారిటీ లేదు.

అయితే ఈ సినిమా కి సంబందించిన వివాదం తెలంగాణ హై కోర్ట్ కి ఎక్కింది.

ఒక వైపు చిత్ర యూనిట్ …. మరో వైపు ఈ సినిమా టైటిల్ మార్చాలి అని బోయ హక్కుల పోరాట సమితి తమ వాదనని బలంగా వినిపిస్తోంది.

తమ కులస్తులను కించపరిచే విధంగా వాల్మీకి టైటిల్ పెట్టారని… అందుకు ఏ మాత్రం ఊరుకొనేది లేదని వారు కోర్టు ముందు విన్నవించుకున్నారు.

ఈ నేపథ్యం లో హైకోర్టు…. సెన్సార్ బోర్డు, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్, డిజీపీ, హీరో వరుణ్ తేజ్‌ లకు నోటీసులు ఇచ్చింది. ఈ విషయంపై నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.