వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. పలు శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇందులో కీలకమైన వాణిజ్యశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ స్నేహలత శ్రీవాస్తవ శనివారం ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

టీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావును జాతీయ పరిశ్రమల శాఖ స్థాయి సంఘం చైర్మన్‌గా నియమించారు.

రవాణా, టూరిజం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా టీజీ వెంకటేశ్‌ నియమితులయ్యారు.

హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్ నేత ఆనంద శర్మ వ్యవహరిస్తారు.

కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా డీఎంకే ఎంపీ కనిమొళిని నియమించారు.