Telugu Global
Cinema & Entertainment

పుట్టిన రోజు.... హీరోగా మారబోతున్న వివి వినాయక్

గత కొంత కాలంగా దర్శకుడు వివి వినాయక్ కి ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ఆఖరిగా వివి వినాయక్ దర్శకత్వం వహించిన ‘ఇంటెలిజెంట్’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ మధ్యనే ఈ ఫ్లాప్ దర్శకుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన నరసింహారావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.  దిల్ రాజు స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. వివి వినాయక్ ఈ […]

పుట్టిన రోజు.... హీరోగా మారబోతున్న వివి వినాయక్
X

గత కొంత కాలంగా దర్శకుడు వివి వినాయక్ కి ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ఆఖరిగా వివి వినాయక్ దర్శకత్వం వహించిన ‘ఇంటెలిజెంట్’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

అయితే ఈ మధ్యనే ఈ ఫ్లాప్ దర్శకుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన నరసింహారావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

దిల్ రాజు స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. వివి వినాయక్ ఈ సినిమాలో హీరోగా కనిపించనున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. ఈ సినిమాకి సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం వి.వి.వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని అక్టోబర్ 9న అధికారికంగా లాంచ్ చేయబోతున్నారట.

పీరియడ్ డ్రామాగా సాగే ఈ సినిమా 1980 బ్యాక్ డ్రాప్ తో నడుస్తుందని సమాచారం. వివి వినాయక్ ఈ సినిమాలో తన వయసుకు తగ్గ పాత్రలో కనిపించనున్నాడట.

అంతేకాకుండా తన పాత్రలో ఫిట్ గా కనిపించడం కోసం వి.వి.వినాయక్ బరువు తగ్గే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

First Published:  14 Sep 2019 2:19 AM GMT
Next Story