Telugu Global
NEWS

అనంతపురం వైసీపీలో... సీనియర్, జూనియర్ రాజకీయాలు

అనంతపురం జిల్లా అధికార పార్టీ లో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. జిల్లాలో ఇప్పుడు ఒక విషయం పై చర్చ జరుగుతోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామి రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు అనుకుంటున్నారు. నిజానికి ఇది కోల్డ్ వారేనా.. లేక తప్పించుకోలేని విచిత్రమైన పరిస్థితి లో ఆ పార్టీ నాయకులు చిక్కుకున్నారా అనేది అక్కడి పరిస్థితిని ఒక్కసారి పరిశీలిస్తే కానీ అర్థం కాదు. అసలేం జరిగిందంటే…. […]

అనంతపురం వైసీపీలో... సీనియర్, జూనియర్ రాజకీయాలు
X

అనంతపురం జిల్లా అధికార పార్టీ లో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. జిల్లాలో ఇప్పుడు ఒక విషయం పై చర్చ జరుగుతోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామి రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు అనుకుంటున్నారు.

నిజానికి ఇది కోల్డ్ వారేనా.. లేక తప్పించుకోలేని విచిత్రమైన పరిస్థితి లో ఆ పార్టీ నాయకులు చిక్కుకున్నారా అనేది అక్కడి పరిస్థితిని ఒక్కసారి పరిశీలిస్తే కానీ అర్థం కాదు.

అసలేం జరిగిందంటే….

శంకర నారాయణ మంత్రి గా పని చేయడం ప్రారంభించి మూడు నెలలు దాటింది. అయినా ఇప్పటివరకు మంత్రి పాల్గొన్న ఏ కార్యక్రమంలోనూ అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొనలేదు. అయితే మంత్రి పాల్గొనే కార్యక్రమాలు అన్నిట్లో ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని రూలేం లేదు కానీ… కనీసం తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో నైనా పాల్గొనాలి కదా. ఆయన ఆ పని చేయడం లేదు. కనీసం ప్రోటోకాల్ ప్రకారం అయినా లోకల్ ఎమ్మెల్యే మంత్రి కార్యక్రమాల్లో పాల్గొనాలి. మరి అనంత ఎందుకు పాల్గొనడం లేదు అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

కాస్త లోతుగా పరిశీలిస్తే పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. అనంత వెంకట్రామిరెడ్డి జిల్లా రాజకీయాల్లో చాలా సీనియర్. ఆయన ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం వైసీపీ తరఫున ఎమ్మెల్యే గాను గెలిచారు. స్థానిక రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు ఆయనకు కరతలామలకం. అందుకే ఈసారి ఆయన వైసిపి మంత్రివర్గంలో స్థానం సంపాదిస్తారని అందరూ అనుకున్నారు. అయితే సామాజిక ఈక్వేషన్ లను బట్టి శంకరనారాయణకు మంత్రి పదవి ఇచ్చారు.

శంకర్ నారాయణ సౌమ్యుని గాను, వివాద రహితుడిగానూ పేరుగాంచారు. ఐదేళ్లపాటు వైసిపి జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఆయనకు ఎవరితోనూ విభేదాలు లేవు. ఈ చరిత్రను, కులాల ఈక్వేషన్ నీ దృష్టిలో ఉంచుకొని శంకర నారాయణకు మంత్రి పదవి ఇచ్చారు జగన్.

అయితే అనంతతో పోలిస్తే శంకర్ నారాయణ చాలా జూనియర్. అందులోనూ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. తనకు వస్తుందన్న మంత్రి పదవిని శంకరనారాయణ దక్కించుకోవటం తో అనంతకి అసంతృప్తి కలిగిందట.

సీనియర్ అయి ఉండి… జూనియర్ అయిన శంకర్ నారాయణ మంత్రిగా పాల్గొనే కార్యక్రమాల్లో పాల్గొనాలంటే ఇబ్బంది పడుతున్నారట అనంత. ఇది ఒక సమాచారం.

కానీ ఇంతకుమించి ఈ ఇద్దరి మధ్య ఏదో ఉన్నదని … అందుకనే అనంత వెంకట్రామిరెడ్డి… శంకర్ నారాయణ పాల్గొనే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదని వైసీపీ లోనే కొందరు అంటున్నారు.

ఎవరు సీనియర్, ఎవరు జూనియర్ అనే విషయాన్ని పక్కన పెడితే… క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా నాయకులు ప్రవర్తిస్తే కానీ దిగువ స్థాయి కార్యకర్తలు వారిని గౌరవించరు. వ్యక్తిగత విభేదాలు పార్టీ భవిష్యత్తును నాశనం చేసేలా ఉండకూడదు కదా అని కొందరు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

First Published:  15 Sep 2019 9:20 AM GMT
Next Story