హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్టు దేవాదాయ ఉద్యోగుల అఫిడవిట్ తప్పనిసరి

దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులు ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలకు చెక్‌పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా తాము హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్టుగా అఫిడవిట్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగుల నుంచి హిందూమతాన్ని విశ్వసిస్తున్నట్టుగా అఫిడవిట్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఉద్యోగులంతా ఈ అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. దేవాదాయ చట్టం ప్రకారం దేవాలయాల్లో ఉద్యోగులుగా హిందువులను మాత్రమే తీసుకోవాలని ఉంది.

ఈ నేపథ్యంలో ఎవరైనా తప్పుడు అఫిడవిట్లు ఇస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూడా ఉత్తర్వుల్లో హెచ్చరించారు.

దేవాలయాల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, కన్సాలిడేటెడ్ ఉద్యోగులందరూ ఈ అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది.