గ్యాంగ్ లీడర్ 2 రోజుల వసూళ్లు

మొదటి రోజు 4 కోట్ల 55 లక్షల రూపాయల షేర్ సాధించిన గ్యాంగ్ లీడర్ సినిమా రెండో రోజు ఇంకాస్త స్ట్రాంగ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 2 రోజుల్లో 8 కోట్ల 4 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. ప్రీమియర్స్ తో కలుపుకొని 2 రోజులకే హాఫ్-మిలియన్ మార్క్ అందుకుంది.

ఇక ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా చూసుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అటుఇటుగా 21 కోట్ల రూపాయలకు అమ్మారు. 2 రోజులకే 8 కోట్లు రావడంతో బయ్యర్లు హ్యాపీగా ఉన్నారు. ఇవాళ్టి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమాకు 3 రోజుల్లో 11 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే తొలి 3 రోజులకే సగం వసూళ్లు సాధించినట్టే. సో.. ఎలా చూసుకున్నా.. మరో వారం రోజుల్లో ఈ సినిమా సేఫ్ వెంచర్ అనిపించుకోవడం ఖాయం అంటోంది ట్రేడ్. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 3.15 కోట్లు
సీడెడ్ – రూ. 0.97 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.10 కోట్లు
ఈస్ట్ – రూ. 0.78 కోట్లు
వెస్ట్ – రూ. 0.48 కోట్లు
గుంటూరు – రూ. 0.72 కోట్లు
నెల్లూరు – రూ. 0.25 కోట్లు
కృష్ణా – రూ. 0.59 కోట్లు